Custard Apple: సీజనల్‌గా దొరికే సీతాఫలం అంటే చాలా మందికి ఇష్టం. అసలు ఈ పండ్ల సీజన్ ప్రారంభమైందంటే చాలు.. బుట్టలు బుట్టలుగా వీటిని తింటారు. తినడానికి ఎంతో టేస్టీగా ఉండే ఈ పండులో విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫ్లేవనాయిడ్లు వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండె సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సాయపడుతుంది. అయితే చాలా మంది సీతాఫలం తిన్న తర్వాత ఆ గింజలను పడేస్తుంటారు. వీటివల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సీతాఫల్ గింజలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
సీతాఫలం పండుతో శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో పాటు వాటి గింజలతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు మేలు చేసే గుణాలు సీతాఫలం గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి కురులు రాలిపోయే సమస్యను తగ్గించడంతో పాటు జుట్టు బలంగా ఉండేలా చేస్తాయి. చుండ్రుని తగ్గించడంతో పాటు జుట్టు దట్టంగా పెరిగేలా చేస్తుంది. అయితే ఈ గింజలను మీరు తలకి రాసుకునే నూనె లేదా కొబ్బరి నూనెలో వేయాలి.
సీతాఫలం తిన్న తర్వాత గింజలను శుభ్రం చేసుకోవాలి. వీటిని కొట్టి పౌడర్ చేసి తలకి రాసుకునే నూనెలో వేసి కాస్త మరిగించాలి. ఈ నూనె చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు జట్టును మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు స్ట్రాంగ్‌గా పెరుగుతుంది. ఈ ఆయిల్‌ను వారానికి ఒకసారి అయిన తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు దురద కూడా తగ్గుతుంది. అయితే ఈ ఆయిల్ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. వీటిలో రసాయనాలు ఉండవచ్చు. కాబట్టి ఇంట్లోనే సహజంగా ఇలా తయారు చేసుకుంటే జుట్టు బలంగా పెరగడంతో పాటు పొడవుగా పెరుగుతుంది.
సీతాఫలం గింజల వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ గింజలతో తయారు చేసిన నూనెను చర్మానికి అప్లై చేయడ వల్ల స్కిన్ మెరుస్తుంది. ఇందులోని ఫ్రీ రాడికల్స్ చర్మంపై ఉండే మొటిమలు, ముడతలను తగ్గించడంతో పాటు అందంగా అయ్యేలా చేస్తుంది. రోజూ వీలు లేకపోతే వారానికి ఒకసారి చర్మానికి ఈ ఆయిల్ అప్లై చేసి స్కిన్‌ను మర్దన చేస్తే మిమ్మల్ని మీరే గుర్తు పట్టేలేనంతగా మారిపోతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.