https://oktelugu.com/

Ind vs SA : జిడ్డు బ్యాటింగ్.. చేతులెత్తేస్తాడు.. టీమిండియా పాలిట అతడో శని గ్రహం..

టీమిండియా లో ఆడేందుకు ఎంతోమంది ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. ఒక్కో స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. కానీ కె.ఎల్ రాహుల్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అతడు సరిగ్గా ఆడ లేకపోయినా జట్టులో స్థానం లభిస్తోంది. జట్టుకు ఉపయోగపడకపోయినప్పటికీ ప్లే -11 లో చోటు దక్కుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 20, 2024 / 10:28 PM IST
    Follow us on

    Ind vs SA : న్యూజిలాండ్ తో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టులో రాహుల్ జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. తొలి ఇన్నింగ్స్ లో సున్నా చుట్టాడు. విలియం ఓరూర్కే బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి విలియం ఓరూర్కే బౌలింగ్ లోనే పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూణే లో జరిగే రెండవ టెస్టులో అతడిని కొనసాగించకూడదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బీసీసీఐకి హితవు పలుకుతున్నారు. రాహుల్ గత 91 ఇన్నింగ్స్ లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. టెస్టులలో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ 33.98 సగటుతో పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. దీంతో అతని వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. అతడి స్థానంలో ధృవ్ జురెల్ లేదా మరో ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

    విదేశీ పర్యటనల్లో..

    రాహుల్ విదేశీ పర్యటనలో అప్పట్లో రాణించాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లపై ఐదారు గట్టి ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. అయినప్పటికీ రాహుల్ ఆట తీరు మార్చుకోవడం లేదు. కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో కొండంత అండగా ఉంటాడనుకుంటే.. గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేక పోయాడు. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి బదులుగా ధృవ్ జురెల్ లేదా అభిమన్యు ఈశ్వర్ ను ఆడించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సీనియర్ ఆటగాడు మనోజ్ తివారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు..” రాహుల్ సరిగా ఆడటం లేదు. అతనిపై పెట్టుకున్న అంచనాలను నిజం చేయలేకపోతున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లోనూ అతడు పూర్తిగా నిరాశపరిచాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం ఇవ్వాలని” మనోజ్ తివారి పేర్కొన్నాడు. కాగా, తొలి టెస్ట్ లో ఒకవేళ రాహుల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అంతేకాదు భారత జట్టు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేది. అయితే రాహుల్ విఫలం కావడంతో మిగతా ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఫలితంగా రెండవ ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఎదుట భారత్ స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచాల్సి వచ్చింది. దానిని న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేదించడంతో భారత జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది.. ఈ ఓటమి నేపథ్యంలో.. పూణే వేదికగా జరిగే రెండవ టెస్ట్ లో భారత జట్టు లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.