BNPL: క్రెడిట్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ‘బీఎన్ పీఎల్’.. కానీ కొంప ముంచుతుంది..?

విదేశాల్లో ప్రారంభమైన BNPL(Buy Now Pay Later) ఇప్పుడు మనదేశంలో ట్రెండీగా మారుతోంది. 2022లో ఒక నివేదిక ప్రకారం 2026 నాటికి వీటి వినియోగదారుల సంఖ్య 30 మిలియన్లు పెరుగుతారని అంచనావేసింది.

Written By: Chai Muchhata, Updated On : August 12, 2023 9:36 am

BNPL

Follow us on

BNPL: కరోనా కాలం తరువాత ఈ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. చాలా మంది వస్తువులు, దుస్తులు ఆన్ లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువులను చేతిలో ఉన్న మొబైల్ ద్వారా బుక్ చేసుకొని ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్ కు ప్రజలు బాగా కనెక్ట్ కావడంతో కంపనీలు సైతం ఇలాంటి కస్టమర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. రెగ్యులర్ కస్టమర్లతో పాటు ప్రత్యేక రోజుల్లో బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కొత్తగా వినిపిస్తున్నపేరు BNPL. ముందు వస్తువులు తీసుకోండి.. ఆ తరువాత డబ్బులు చెల్లంచండి అని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ ఆఫర్లకు ఆకర్షితులవుతున్నారు. అయితే ఇక్కడ ఓ విషయంతో కస్టమర్లు జాగ్రత్తగా ఉండకపోతే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదెంటో తెలుసుకోండి..

విదేశాల్లో ప్రారంభమైన BNPL(Buy Now Pay Later) ఇప్పుడు మనదేశంలో ట్రెండీగా మారుతోంది. 2022లో ఒక నివేదిక ప్రకారం 2026 నాటికి వీటి వినియోగదారుల సంఖ్య 30 మిలియన్లు పెరుగుతారని అంచనావేసింది. అందుకు అనుగుణంగానే ప్రతీ సంవత్సరం బీఎన్ పీఎల్ వినియోగదారులు పెరుగుతూ వస్తున్నారు. 2023 ఏడాది చివరి నాటికి దీని పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ మార్కెట్లో తీవ్రమైన చర్చ సాగుతోంది.

ఇప్పడు డబ్బులు చెల్లంచకుండానే వస్తువులను సొంతం చేసుకోండి.. అనగానే చాలా మంది వినియోగదారులు వెంటనే తమకు అవసరం ఉన్నా.. లేకున్నా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వస్తవులు కొనాలనుకునేవారు.. తమ దగ్గర డబ్బులు లేనివారు ఈ ఆఫర్ సౌకర్యవంతంగానే ఉంటుంది. కానీ తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు. లేకుంటే ఇల్లు గుల్ల అవుతుందని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ముందుగా తొందరలో వస్తువులను సంతోషంగా కొంటారు. సరైన సమయంలో వీటిని చెల్లిస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ చెల్లించకపోతే మాత్రం భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫైన్ వేలల్లో ఉండే అవకాశం ఉంది. మొన్నటి వరకు క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు ఇలా ముందుగా వస్తువులు చెల్లించి ఆ తరువాత బిల్లులు చెల్లించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నంగా దీనిని వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు కంటే బీపీఎన్ఎల్ లో ఎక్కువ ఫైన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల బీపీఎన్ఎల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.