Homeకరోనా వైరస్Omicron In India: రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. భారత్‌లో ఇక థర్డ్ వేవ్.. ?

Omicron In India: రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. భారత్‌లో ఇక థర్డ్ వేవ్.. ?

Omicron In India: కరోనా మహమ్మారి భయాలు ఇంకా తగ్గాయి అనుకునే లోపు మళ్లీ మొదలవుతున్నాయి. ఇటీవల కాలంలో ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడాన్ని చూసి చాలా మంది మళ్లీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Omicron In India
Omicron In India

భారతదేశంలోని ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లో ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి 7,347 మంది కోలుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌తో 302 మంది చనిపోయారు. కొవిడ్ మహమ్మారి నుంచి రికవరీ పేషెంట్స్ కంటే కూడా కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నమోదయిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,48,08,886కి చేరింది. ఇందులో 3,42,51,292 మంది కరోనా బారిన పడ్డప్పటికీ తర్వాత కోలుకున్నారు. కొవిడ్ బారినపడి 4,80,592 మంది చనిపోగా, ప్రజెంట్ ఇండియాలో 77,002 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read: ముసురుకుంటున్న కరోనా..ఢిల్లీ, ముంబైలో తీవ్రత 70శాతం వరకూ..

ఇకపోతే మనదేశంలో కొవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు 0.79 పర్సెంటేజీగా ఉంది. డెయిలీ పాజిటివిటీ రేటు ఒక శాతం లోపే ఉంటుంది. కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో కేరళ స్టేట్ టాప్‌లో కొనసాగుతోంది. కేరళ రాష్ట్రంలో తాజాగా 2,474 కేసులు నమోదు కాగా, 3,052 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. 244 మంది మరణించారు. మహరాష్ట్రలో మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 1,000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహరాష్ట్రలో 1,485 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

భారతదేశం మొత్తంగా 11.67 లక్షల మందికి కొవిడ్ టెస్టులు చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 67.52 లక్షల మందికి వ్యాక్సిన్స్ వేశారు. 143.15 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ ప్రజలకు అందజేశారు. మరో వైపున దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు పెరగడం ప్రతీ ఒక్కరికి ఆందోళన కలగజేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 781 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. 241 మంది బాధితులు కోలుకున్నారు.

Also Read: న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version