https://oktelugu.com/

Rajamouli-Mahesh Babu: ‘మహేష్ సినిమా’ పై ఓపెన్ అయిన రాజమౌళి !

Rajamouli-Mahesh Babu: రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పలు ప్రెస్ మీట్స్ పెడుతూ మీడియా వారితో ముచ్చట్లు చెబుతున్నాడు. అలాగే మధ్యమధ్యలో టీవీ కార్యక్రమాలు అంటూ వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ మొత్తానికి సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అయితే, రాజమౌళి ఎక్కడకి వెళ్లినా తన తర్వాత సినిమా ఏమిటి ? అంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక జక్కన్నకి కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పలేదు. రాజమౌళి మాటల్లోనే.. ‘నా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 / 01:42 PM IST
    Follow us on

    Rajamouli-Mahesh Babu: రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పలు ప్రెస్ మీట్స్ పెడుతూ మీడియా వారితో ముచ్చట్లు చెబుతున్నాడు. అలాగే మధ్యమధ్యలో టీవీ కార్యక్రమాలు అంటూ వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ మొత్తానికి సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. అయితే, రాజమౌళి ఎక్కడకి వెళ్లినా తన తర్వాత సినిమా ఏమిటి ? అంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక జక్కన్నకి కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పలేదు.

    Rajamouli-Mahesh Babu

    రాజమౌళి మాటల్లోనే.. ‘నా తర్వాత ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది’ అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అయితే తన తర్వాత సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది ? అనే దాని పై మాత్రం జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే, “బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పూర్తి భిన్నంగా తన తర్వాత సినిమా ఉండబోతుందని రాజమౌళి స్పష్టం చేశాడు.

    అయితే, ఈ సినిమా కథ పై గతంలో విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశాను. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది’ అని చెప్పాడు. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు.

    Also Read: బిగ్ న్యూస్.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతంలో’ చెర్రీ, తారక్.. 

    క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదేనట. కాకపోతే.. ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయట. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా అద్భుతంగా ఉంటుంది. అయితే మధ్యలో మరో రూమర్ కూడా వినిపించింది.

    విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన కథ రాజమౌళికి నచ్చలేదని.. దాంతో సీక్రెట్ ఏజెంట్ జోనర్ లో సాగే ఓ హాలీవుడ్ సినిమా రైట్స్ తీసుకుని.. ఆ సినిమా ఆధారంగా మరో కథ రాస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ కి సూచించాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ టీమ్ ఆ కథ పైనే వర్క్ చేస్తుందని అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో చూడాలి.

    Also Read: ప్చ్.. ఏమిటి మహేష్ ఇలా అయిపోయాడు ?

    Tags