
Covid-19 Third Wave: కరోనా వైరస్ విస్తరిస్తోంది. మరోమార ప్రపంచాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. మూడో దశ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా మూడో ముప్పు త్వరలో రాబోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంచనాకు వస్తున్నారు. దీంతో దేశంలో మూడో ముప్పు వస్తే ఎలా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండటం లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో నిబంధనలు గాలికి ఒదిలేయడంతో కరోనాపై సహజంగానే భయాలు వస్తున్నాయి. మరోవైపు పండుగల వేళ ఎలాంటి నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజల్లో భయం లేకుండా పోతోంది. దీంతోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం మొదలైన కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలను అత్యంత బాధించిన వ్యాధిగా ఖ్యాతికెక్కిన వైరస్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. రాష్ర్టంలో అధికారిక లెక్కల ప్రకారం ఒక్క రోజులో గరిష్టంగా 10 వేల కేసులు 50కి పైగా మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. అయితే గత మూడు నెలలుగా కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజుకు 150-300 కేసులు వెలుగు చూడటంతో శుభకార్యాలు, పండుగల్లో కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ కేంద్రం తెలంగాణకు రూ.456 కోట్లు విడుదల చేసింది. 27 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించింది. పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం 20 పడకలను ఏర్పాటు చేసి కరోనా ముప్పును తప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే?