Meena Tested Covid Positive: కరోనా భయం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించకముందే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. మీనాకి, అలాగే మీనా ఇంట్లో వారికి కోవిడ్ అటాక్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారట.

సోషల్ మీడియా వేదిక పై ఈ విషయాన్నీ మీనా పోస్ చేస్తూ.. ‘2022లో కరోనా మా కుటుంబంలో చొరబడింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా ఉండండి. మరింతగా వ్యాప్తి చెందకుండా చూడాలి’ అని రాసుకొంది. ఇక గత కొన్ని రోజులుగా మీనా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా కరోనా అని తేలింది కూడా షూటింగ్ స్పాట్ లోనే. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు.
Also Read: మాటలు రావడం లేదంటున్న అల్లు అర్జున్ చెల్లి… ఎందుకంటే ?
ఏది ఏమైనా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు. షూటింగ్ స్పాట్స్ లో కరోనా కలకలం సృష్టిస్తే.. ఒక్కసారిగా ఆ స్పాట్ లో ఉన్న వంద మందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు అందరి టెన్షన్. పోనీ షూటింగ్ కి బ్రేక్ ఇద్దామంటే.. ఇప్పటికే మొదలైన సినిమాలకు అతి గతి లేకుండా పోతుంది.
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబుకి “థాంక్ యూ” చెప్పిన ఐకాన్ స్టార్… ఎందుకంటే ?