Constipation: పురాతన కాలం నుంచి ఇంగువను వాడుతున్నారు. ఇంగువ అనేది ఒక మసాలా. దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఏవైనా మసాలా వంటలు, అప్పడాలు, సాంబార్ వంటివి వండేటప్పుడు ఇంగువ లేకపోతే అసలు వంట రుచి ఉండదు. చిటికెడు అయిన ఇంగువ వేస్తే ఆ వంట రుచే మారిపోతుంది. ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, వాటర్ తక్కువగా తాగడం వల్ల చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంగువలోని పోషకాలు అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడుతుంది. రోజూ ఇంగువ నీరు తాగడం వల్ల మలబద్ధకంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. మరి ఇంగువ వాటర్‌తో ఏ వ్యాధుల నుంచి విముక్తి చెందవచ్చో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
మలబద్ధకం సమస్యలు..
కొందరు మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం వంటివి జరుగుతాయి. దీనివల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఇంగువ నీరు బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఇంగువ నీరు తాగితే ఉదయం మల విసర్జన ఫ్రీగా అవుతుంది. దీర్ఘకాలికంగా దీని నుంచి బాధ పడుతున్నట్లయితే రోజూ ఇంగువ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈజీగా మలబద్ధకం సమస్య నుంచి విముక్తి చెందుతారు.
తలనొప్పి నుంచి ఉపశమనం
ఇంగువ నీటిని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంగువ నీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలనొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి. తీవ్రంగా తలనొప్పితో బాధ పడుతున్నట్లయితే ఈ ఇంగువ వాటర్ ఒకసారి ట్రై చేసి చూడండి.
కడుపు సంబంధిత సమస్యలు
డైలీ ఇంగువ నీరు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి. కడుపులో చల్లగా ఉంటుంది. ఇది యాసిడ్‌ను ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
బరువు తగ్గడం
ఇంగువ వాటర్ వల్ల తొందరగా బరువు తగ్గుతారు. గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూను ఇంగువ వేసి తాగితే తొందరగా రిజల్ట్ ఉంటుంది. బరువు తగ్గాలని ఏవైనా మందులు వాడటం కంటే ఇంగువ వాడటం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
జీర్ణ సమస్యలు
జీర్ణ క్రియ సక్రమంగా పని చేయని వారు ఇంగువ వాటర్ తాగడం వల్ల సమస్య తీరిపోతుంది. శరీరంలో ఉండే హానికరమైన రసాయనాలకు ఇంగువ బయటకు పంపిస్తుంది. రోజూ ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ ఇంగువ వాటర్‌ను ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.