Coconut Water : ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరుచుకోవాలంటే.. పోషకాలు, ఖనిజ లవణాలు ఉన్న పానీయాలను తాగాలి. అలాంటి పానీయాలలో ప్రకృతి ప్రసాదించిన వరం కొబ్బరి బోండాం. ఎండాకాలంలో వీటిని ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అయితే దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్ తో బాధపడేవారు వైద్యుల సలహాతోనే కొబ్బరి బోండాలు తాగడం మంచిది. కొబ్బరి బోండాలు అన్నికాలాల కంటే
వేసవికాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటి నీటిలో క్యాల్షియం, పొటాషియం, ఇతర ఖనిజలవణాలు మెండుగా ఉంటాయి. అందువల్లే ఈ నీటిని తాగితే సత్వర శక్తి లభిస్తుంది. డిహైడ్రేషన్ నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది.. అయితే మనలో చాలామందికి కొబ్బరి బోండాలలోకి మీరు ఎలా వెళ్తుందనేది ఇప్పటికీ సమాధానం లభించని సందేహమే. ఇంతకీ కొబ్బరి బోండాలలోకి నీళ్లు ఎలా వెళ్తాయి అంటే..
Also Read : లాయర్, అడ్వకేట్, బారిస్టర్ ల మధ్య తేడా ఏంటి? ఎవరు ఎవరి వైపు ఉంటారు?
ఐదు మీటర్ల లోతుకి వెళ్తాయి..
కొబ్బరి చెట్ల వేర్లు దాదాపు 5 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటాయి. ఈ వేర్ల ద్వారా కొబ్బరి చెట్లు భూమి నుంచి నీటిని పీల్చుకుంటే. ఆ నీటిని కాండం ద్వారా వివిధ ప్రక్రియల రూపంలో పైకి రవాణా చేసుకుంటాయి. ఇలా నీటిని రవాణా చేయడంలో జైలమ్ నాళాలు ప్రత్యేక పాత్ర పోషిస్తుంటాయి. చివరికి ఆ నీరు కొబ్బరి కాయలోకి వెళ్తుంది.. కొబ్బరికాయలు మూడు నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఎక్సో కార్ప్, మీసో కార్ప్, ఎండోకార్ప్ అని పిలుస్తుంటారు. ఈ మూడు పొరలలో ఎండోకార్ప్ లో మీరు నిల్వ ఉంటుంది. ఆకుపచ్చగా ఉండే భాగాన్ని ఎక్సో కార్ప్ అని పిలుస్తుంటారు. ఆ తర్వాత పీచు భాగాన్ని మీసో కార్ప్ అని పిలుస్తుంటారు. అయితే ఎండోకార్ప్ లోనే నీరు నిల్వ ఉంటుంది. ఇందులో తెల్లని గుజ్జులాంటి భాగం ఉంటుంది. కొబ్బరికాయ ముదురుతున్నకొద్దీ ఈ భాగంలో కొబ్బరి గట్టి పడుతూ ఉంటుంది. అయితే గట్టిపడిన కొబ్బరిలో నీరు తీయగా ఉంటుంది. లేత కొబ్బరిలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది ఊహించిన స్థాయిలో తీయగా ఉండదు. అయినప్పటికీ ఎండాకాలంలో దేహం నీరసానికి గురైనప్పుడు వైద్యులు లేక కొబ్బరి బొండాలు తాగాలని సూచిస్తారు. అప్పుడే దేహం లవణాలను పెంపొందించుకుంటుందని చెబుతుంటారు..”కొబ్బరి చెట్టు నిర్మాణం ప్రత్యేకమైనది. దీని వేర్లు ఐదు మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటాయి. నీటిని సేకరించి ప్రత్యేకమైన విధానాలలో పైకి పంపిస్తుంటాయి. తద్వారా ఆ నీరు కొబ్బరి బోండాలలోకి చేరుతుంది. అది వివిధ ప్రక్రియల తర్వాత రుచికరంగా మారుతుంది. కొబ్బరినీరులో పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చికొబ్బరి లోనూ అదే స్థాయిలో పోషకాలు లభిస్తుంటాయి. శరీరం నీరసానికి గురైనప్పుడు చాలామంది కొబ్బరి నీరు తాగుతుంటారు. దీనివల్ల దేహం ఒక్కసారిగా శక్తివంతమవుతుంది. కొబ్బరి బోండాం అనేది ప్రకృతి ప్రసాదించిన వరమని” వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read : నీటితో నిండిన కొబ్బరికాయను ఇలా సులభంగా గుర్తించవచ్చు..