Male Fertility: ప్రపంచం పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటోంది. అందులో కాలుష్యంతోనే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కాలుష్య కారకంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. కాలుష్య కారక నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండటం తెలిసిందే. కాలుష్య కారకాల ప్రభావంతో సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతోందని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యంపై ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో మానవజాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. కానీ ఎవరు కూడా కాలుష్య కారకాల తగ్గింపుపై చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దాని ప్రభావంతో ప్రపంచమే భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం పొంచి ఉంది.

పురుషుల సంతాన సాఫల్యతపై కాలుష్యం పెనుప్రభావం చూపుతోందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాలుష్య ప్రభావంతో ప్రకృతి కూడా నాశనం అవుతోంది. కొండలు పిండి చేస్తున్నారు. వాగులు, చెరువులు లాంటి ప్రకృతి వనరులు కనుమరుగవుతున్నాయి. దీంతోనే కాలుష్యం కోరలు చాస్తోంది. ఇందులో ధ్వని కాలుష్యం, వాయుకాలుష్యం, జల కాలుష్యం ఒకటేమిటి పలు మార్గాల్లో కాలుష్యం మనుషుల జీవనంపై దుష్ర్రభావం చూపుతోన్నట్లు సమాచారం.
Also Read: Ram Gopal Varma Konda Movie: కొండా మురళి-సురేఖ చరిత్ర ఇదీ.. ఆర్జీవీ తన సినిమాలో ఏం చూపిస్తాడు?
ఇప్పటికే ప్రపంచంలో సంతానలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. పురుషుల్లో అంగస్థంభన సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై పర్యావరణ నిపుణుడు పాస్నా స్వాన్ ఓ పుస్తకం రాశారు. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మానవ జాతి మనుగడ కాలుష్య కారకాల ప్రభావంతో జీవన్మరణ సమస్య కానుంది. పురుషుల సామర్థ్యం తగ్గి సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి డాక్టర్లు వైద్యం చేస్తున్నా కూడా తగ్గనంత స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.

కాలుష్యకారకాలతో పుట్టే సంతానం కూడా అదే తీరుగా పుడుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. మనం వాడే రసాయనాల ప్రభావాలతో కూడా మన జీవన విధానం మారిపోతోంది. గతంలో ఎందులో కూడా రసాయనాలు వాడలేదు. కానీ ఇప్పుడు కూరగాయాలు, పండ్లు, సౌందర్య సాధనాలు తదితర వాటిలో వాడే రసాయనాల వల్ల మనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పర్యావరణ సమస్యలతో మానవ జీవితమే గందరగోళంలో పడిపోతోంది. దీనికి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతోనే సంతానోత్పత్తిపై పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. అందులో ఎన్నో వైవిధ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాబోయే కాలంలో కాలుష్య కారకాల వల్ల ఎన్నో దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై అందరు మేల్కొని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Anasuya Walks Out Of Jabardasth: సుధీర్, ఆది, ఇప్పుడు అనసూయ… బయటికి వస్తున్నారా? పంపుతున్నారా ?