https://oktelugu.com/

PAN Card: పాన్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేయండి

ఆధార్ వివరాలతో పాన్ కార్డులో అడ్రస్ ను మార్చుకోవచ్చు. దీనికి గాను UTIITSL (యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్ర్ టెక్నాలజీ అండ్ సర్వీస్ లిమిటెడ్) పోర్టల్ ఓపెన్ చేయాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 12, 2023 / 07:03 PM IST

    PAN Card

    Follow us on

    PAN Card: దేశంలో ఇప్పుడు అన్నింటికి పాన్ కార్డునే చూస్తున్నారు. దీన్ని ఇన్ కమ్ టాక్స్ శాఖ జారీ చేస్తుంది. పది అంకెల అల్ఫాన్యూమరిక్్ నెంబర్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ట్రాన్జాక్షన్ లలో పాన్ ప్రత్యేకమైన ఐడెంటిఫయర్ గా పనిచేస్తుంది. ఇందులో పన్ను చెల్లింపులు, ఆదాయ రాబడి వంటివి ఉంటాయి. అందుకే అన్నింట్లో పాన్ కార్డు లేనిదే ఏ పని కావడం లేదు. ప్రస్తుతం ఆధార్, పాన్ కార్డు ఉంటేనే ఏ పని అయినా సాగుతుంది.

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ను జారీ చేస్తుంది. 12 అంకెల ఐడెంటిఫికేషన్, అడ్రస్ కు ప్రూఫ్ గా పనిచేస్తుంది. ప్రభుత్వం పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలని చూసింది. రెండింటిలో లేటెస్ట్ అడ్రస్ ఉండేలా వివరాలు సరిపోయేలా చూసుకోవాలని సూచిస్తోంది. పాన్ కార్డులో రెసిడెన్సియల్, అడ్రస్ ను అప్ డేట్ చేసుకోవాలని చెబుతోంది.

    ఆధార్ వివరాలతో పాన్ కార్డులో అడ్రస్ ను మార్చుకోవచ్చు. దీనికి గాను UTIITSL (యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్ర్ టెక్నాలజీ అండ్ సర్వీస్ లిమిటెడ్) పోర్టల్ ఓపెన్ చేయాలి. పాన్ కార్డులోని వివరాలు మార్చడానికి లేదా సరిచూసుకోవడానికి అప్లై ఫర్ చేంజ్ /కరెక్షన్ ఇన్ పాన్ కార్డు డీటైల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి.

    పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ బేస్ ఇ కేవైసీ అడ్రస్ అప్ డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది UIDAI డేటా బేస్ నుంచి అడ్రస్ వివరాలు పొందవచ్చు. ఆధార్ నెంబర్, ఇ మెయిల్ ఐడీ, మొబైల్ ననెంబర్, ఇతర అవసరమైన వివరాల సహా అవసరమైన మొత్తం సమాచారం ఎంటర్ చేసుకోవాలి. ప్రతిది సరిగా చూసుకుని నమోదు చేయాలి. అన్ని నిర్ధారించుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.