Jabardasth Comedian Hari: శేషాచలం అడవుల్లో ఏ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందో, దాని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉంటుందో, బడా బడా నేతలు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో పుష్ప మూవీలో చూశాము. ఆ చిత్రంలో చూపించింది చాలా వరకు నిజమే. దశాబ్దాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కొందరు కింగ్స్, కోటీశ్వరులుగా ఎదిగారు. నేర సామ్రాజ్యం సృష్టించుకున్నారు. జబర్దస్త్ షోలో స్కిట్స్ చేసుకునే కమెడియన్ స్మగ్లర్ గా మారడం సంచలనం రేపుతోంది. జబర్దస్త్ లో హరి అనే కమెడియన్ వందల స్కిట్స్ చేశాడు. అతడు లేడీ గెటప్స్ కి ఫేమస్.
అచ్చు అమ్మాయిలా ఉండే హరికి మంచి డిమాండ్ ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హరి గిలిగింతలు పెడతాడు. హరి రెడ్ శాండల్ స్మగ్లింగ్ ముఠాలతో చేతులు కలిపాడు. ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడు. మొదటిసారి హరి గురించి తెలిసినప్పుడు అందరూ షాక్ అయ్యాడు. జబర్దస్త్ కమెడియన్ రెడ్ శాండల్ స్మగ్లర్ కావడమేంటని ఆశ్చర్యపోయారు.
ఈ ఆరోపణలపై హరి వివరణ ఇచ్చారు. నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి హరి పేరు తెరపైకి వచ్చింది. పోలీసుల దాడిలో హరి గ్యాంగ్ కి చెందిన కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ. 60 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందుతుడు హరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ మేరకు పలమనేరు సీఐ మీడియాకు వివరాలు వెల్లడించారు. జబర్దస్త్ కమెడియన్ హరి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. తమ టాలెంట్ తో జబర్దస్త్ వేదికగా అనేక మంది స్టార్స్ గా అవతరించారు. కొందరు మాత్రం ఇలా టాలెంట్ వదిలేసి అనతికాలంలో డబ్బు సంపాదించాలని తప్పుడు మార్గం వెతుక్కుంటున్నారు. ఇలాంటి వాళ్ళ వలన జబర్దస్త్ షోకి చెడ్డపేరు వస్తుందని కొందరు వాపోతున్నారు.