Chanakya Niti Goal: మానవ జీవితంలో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దడానికి చాణక్యుడు ఆ రోజుల్లోనే ఎన్నో నీతులు చెప్పారు. ఆయన వ్యాఖ్యలను అనుసరించిన వాళ్లు ఎంతో మంది తమ జీవితాలను సుఖమయం చేసుకున్నారు. చాణక్య నీతి అనుసరిస్తే జీవితంలో ఎన్నో విజయాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారానికి రూట్ దొరుకుతుంది. అందుకే చాణక్య నీతి శాస్త్రం బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన చెప్పిన విషయాల ప్రకారం.. మానవులు కొన్ని లక్షణాలు లేకుంటే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు చెప్పాడు. వీటికి దూరంగా ఉంటే ఎన్నటికీ విజయం దరిదాపులకు కూడా చేరలేడని అంటున్నారు.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటారు కొందరు. కానీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలంటే క్రమశిక్షణ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ అంకితభావం పనులు చేస్తూ అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. క్రమశిక్షణతో పాటు ఇతరులపై ప్రేమ, బాధ్యతను కలిగి ఉండాలి. అప్పుడే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. క్రమశిక్షణ
లేని వ్యక్తులు జీవితంలో ఏదీ సాధించలేరు.
ఏ పనిని ఎంచుకున్నా దానిని పూర్తి చేయాలంటే ఏకాగ్రత, నిజాయితీ ఉండాలి. ఒక పనిని మొదలుపెట్టి దానిని మధ్యలోనే ఆపేసేవారు కూడా ఏ పనిని చివరి వరకు తీసుకెళ్లలేదు. అలాగే ఒక పనిని మొదలుపెట్టినపపుడు దానిపై కాన్ సెంట్రేషన్ చేయాలి.అలాగే చేసే పనిలో కచ్చితంగా నిజాయితీ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవినీతి వైపు వెళ్లకూడదు. అక్రమమార్గాన లక్ష్యాన్ని చేరినా అది నిజమైన విజయం అనిపించుకోదు.
ఏ వ్యక్తికైనా జ్ఒనం ఉండాలి. పుట్టుకతోనే ఎవరికీ తెలివి ఉండదు. దీనిని తెచ్చుకోవడానికి పుస్తకాలు చదవాలి. తెలివైన వారితో మాట్లాడుతూ ఉండాలి. లోక జ్ఒనం గురించి తెలియని వ్యక్తికి చేసే పనిపై అవగాహన ఉండదు. దీంతో ముందుకు సాగలేడు. పుస్తకాలు వ్యక్తులకు స్నేహితుడిలాగా ఉంటాయి. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు సరైన జ్ఒనం లభిస్తుంది.
ప్రతీ పనికి ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రణాళిక లేకుండా ఏ పని మొదలుపెట్టినా ఇన్ టైంలో పూర్తి చేయడం సాధ్యం కాదు. సమయభావం కచ్చితంగా ఉంటే అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఎదుటివారి మెప్పు పొందగలరు. ఒకవేళ సమయాభావం లేకుంటే అది వృథా ప్రయాసే అవుతుంది. చివరగా ఇతరులపై గౌరవం కలిగి ఉండాలి. ఎదుటివారిని గౌరవం ఇస్తూ వారి నుంచి పొందాలి. అప్పుడే సంబంధాలు మెరుగుపడుతాయి. అప్పుడే అనుకున్న పని ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది.