Chanakya Niti Money: ఆచార్య చాణక్యుడు జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో డబ్బుకు సంబంధించిన చాలా విషయాలు సూచించాడు. డబ్బు ఎలా సంపాదించాలి? ఏ విధమైన జాగ్రత్తలు వివరించాడు. డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెలిపాడు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడం అంత మంచిది కాదు. డబ్బు ఎప్పుడు కూడా న్యాయంగానే సంపాదించాలని గట్టిగా చాటాడు. ఆగాన వచ్చింది భోగాన పోతుందంటాడు.
డబ్బుతో జాగ్రత్త
డబ్బులో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతాడు. మన దగ్గర డబ్బు ఉన్నదని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్ లో కష్టాలు పడాలి. అందుకే ధనమున్నప్పుడు పొదుపు చేయడం ఉత్తమం. మంచి మంచి పనులు చేయడం ఉత్తమం. ఇలా డబ్బు విషయంలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉన్నవాడే సంపదను కూడబెడతాడు. అతడే జీవితంలో పైకి ఎదుగుతాడని చాణక్యుడు చెప్పాడు.
సరైన వాటిలో పెట్టుబడి
మనం సంపాదించే డబ్బును సరైన వాటిలో పెట్టుబడి పెడితేనే సార్థకత ఉంటుంది. అవసరం లేని వాడికి డబ్బు ఇవ్వడం వల్ల అది పనికి రాకుండా పోతుంది. డబ్బు పెట్టుబడిగా పెడితే వారికి బాగా ఉపయోగపడాలి. అప్పుడే దానికి సార్థకత ఇచ్చినట్లు అవుతుంది. ఇలా మన డబ్బుకు సార్థకత రావాలంటే సరైన వాటిలో పెట్టుబడి పెట్టడమే సురక్షితమని చాణక్యుడు చాటాడు.
ఆర్థిక విజయం కీలకం
మనం సంపాదించేందుకు కారణమైన వారిని బాగా చూసుకోవాలి. వారు లేనిదే మనం లేము అనే విషయం గమనించుకోవాలి. వారికి సరైన ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందజేయాలి. వారి క్షేమం కోసం పాటుపడాలి. ఆర్థికంగా మనమే కాదు మనతో పాటు పదిమందిని ఎదిగేలా చేయడంలోనే విజయం దాగి ఉంటుంది. అందుకే మన దగ్గర పనిచేసే వారిని కూడా బాగా చూసుకుంటేనే మనకు మంచి జరుగుతుందని చాణక్యుడు వివరించాడు.
గుణవంతుడికే ధనసాయం
డబ్బును ఎప్పుడైనా మంచి వారికే దానం చేయాలి. అపాత్ర దానం చేయడం అవివేకం. డబ్బు విలువ తెలుసుకుని మంచి వారికే దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈనేపథ్యంలో చాణక్యుడు ఏ సందర్భాల్లో దానం చేయవచ్చో కూడా సూచించాడు. ఎలాంటి వారికి ఇవ్వాలో కూడా తెలపడం గమనార్హం. ఇలా చాణక్యుడి ప్రకారం మనం డబ్బు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.