Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఏం చేయాలనేదానిపై కూలంకషంగా చర్చించాడు. తన మేధస్సుతో చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజ్యాధికారం దక్కించుకునేందుకు ఎన్నో విషయాలు సూచించాడు. మనిషి సంతోషకరమైన జీవితం గడపాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో చాణక్యుడి విధానాలు పాటిస్తే కచ్చితంగా సంతోషంగా ఉంటాడని వివరించాడు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం జన్మనిచ్చిన తల్లికి మంచి స్థానం ఇవ్వాలి. గురువు, దేవుడి కంటే తల్లికే ప్రాధాన్యం ఇవ్వాలి. మాతృమూర్తిని గౌరవించాలి. వారి మాటను తీసివేయకూడదు. తల్లిని గౌరవించే వారికి జీవితంలో అన్ని కోరికలు తీరుతాయి. అందుకే మాతృదేవోభవ అంటారు. తల్లిని దైవంగా భావించుకుని వారిని బాగా చూసుకునే వారికి విజయాలు కలుగుతాయి. తల్లిదండ్రులను కచ్చితంగా ప్రేమించే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. తల్లిని దేవతగా పూజించే వారికి అన్ని పనుల్లో ఆటంకాలు లేకండా ఉంటాయి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నాన్ని దైవంతో సమానంగా భావిస్తారు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది. దానధర్మాలు చేస్తుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. పరోపకారం చేయని వాడు పశువుతో సమానం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. తోటి వారిని ప్రేమించాలి. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయకూడదు. మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ చెడు మాత్రం చేస్తే మనకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకే అంటారు చెరపకురా చెడేవు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రంగా గాయత్రి మంత్రానికి పేరుంది. గాయత్రి మంత్రం పఠించడం ద్వారా మనిషి ఎన్నో విజయాలు అందుకుంటాడు. దైవానుగ్రహం కలుగుతుంది. బలం, అపారమైన శక్తి వస్తుంది. ఏకాదశి తిథి రోజు మహావిష్ణువును పూజించడంతో కష్టాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు విష్ణువును కొలవడం ద్వారా పుణ్యం కలుగుతుంది. ఏడాదికి 24 ఏకాదశులు రావడంతో ఆ రోజు దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మాత్రం విష్ణువును కచ్చితంగా పూజించాలి.
జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోకూడదు. కలలను సాకారం చేసుకోవాలంటే ధైర్యంగా ఉండాలి. కలలను నెరవేర్చుకునేందుకు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. లక్ష్యసాధనలో చురుకుగా వ్యవహరించాలి. అప్పుడే విజయాలు సొంతం అవుతాయి. ఆచార్య చాణక్యుడు సూచించిన విధానాల ప్రకారం ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన మార్గాలు పాటిస్తే మంచి మార్పులు కలగడం సహజమే. చాణక్యుడి విధానాల ప్రకారం నడుచుకుంటే ఎన్నో విజయాలు మన సొంతం అవుతాయని గుర్తుంచుకోవాలి.