Chanakya Niti- Secrets: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు తెలియజేశాడు. జీవితంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా వివరంగా పేర్కొన్నాడు. దీంతో మనం ఎదిగే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాడు. ఎప్పుడైనా మనం పెద్దల మాట పెరుగన్నం మూటగా భావించాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకోవడం కోసం పలు మార్గాలు సూచించాడు. మనం చేసే కొన్ని పొరపాట్లు గ్రహపాట్లు అవుతాయని తెలిసిందే. అందుకే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రం ప్రకారం మనకు ఎన్నో విషయాలు వివరించాడు.

కుటుంబ విషయాలు బయటి వ్యక్తులతో ప్రస్తావించొద్దు. ఇంటి విషయం గడప దాటొద్దు. ఊరి విషయం పొలిమేర దాటొద్దనేది సామెత. అందుకే మన సొంత విషయాలు ఇతరుల ఎదుట ఎప్పుడు చర్చించకూడదు. ఇలా చేస్తే మనం చులకన అయిపోతాం. వారికి మన గెటివ్ దొరుకుతుంది. దీంతో మన బలహీనతలు బయటపడే అవకాశముంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. చాణక్యుడు సూచించిన మార్గమే శిరోధార్యం అని భావించుకోవాలి.
Also Read: Anchor Lasya: ఇంకోసారి గర్భం తెచ్చుకో అంటే చెంప చెళ్లుమనిపిస్తా.. యాంకర్ లాస్య ఫైర్!
వైవాహిక జీవితంలో కూడా వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు ఎట్టి పరిస్థితుల్లో అవతలి వారికి తెలియకూడదు. అలా తెలిస్తే మనం చులకన అయిపోతాం. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటిగుట్టు రచ్చకీడ్చకూడదు. మన కుటుంబ విషయాలు మన మధ్యనే ఉండాలి. ప్రాణం పోయినా ఇతరులతో చర్చించకూడదదు. చాణక్యుడు సూచించిన మార్గాలను అనుసరించి మన జీవితంలో కష్టాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి.

బాధలను కూడా చెప్పుకోకూడదు. అవమానాలను బహిర్గతం చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిగత విషయాలు తెలియరాదు. అలా చేస్తే మన బలహీనతలు బయటపడతాయి. ఫలితంగా మన మీదు చెడు ప్రభావం పడుతుంది. మన శక్తులు పనిచేయవు. మనల్ని తక్కువగా అంచనా వేసి హీనంగా చూస్తారు. అందుకే ఎప్పుడైనా మన విషయాలు ఇతరులతో షేర్ చేసుకోవడం అంత మంచిది కాదనే విషయం గ్రహించాలి.
భార్య గురించి వివరాలు కూడా ఎవరికి చెప్పకూడదు. ఆమెతో గొడవ పడినా ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. అలా చేస్తే మన ప్రతిష్ట దిగజారుతుంది. ఇతరుల దృష్టిలో మనం చులకన అయిపోతాం. అందుకే మన ఇంటి విషయాలు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ చెప్పుకోకపోవడమే ఉత్తమ. ఇలా ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు విడమర్చి చెప్పాడు. మనం సుఖంగా జీవించాలంటే ఇవన్నీ పాటించి తీరాలి. లేకుంటే సమస్యలు తప్పవు.
Also Read:Somu Veerraju vs AP Police : ఎవడ్రా నన్ను ఆపేది..! కట్టలు తెంచుకున్న సోము ఆవేశం