Chanakya Niti: రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రంలో అపారమైన విజ్ఞానాన్ని అందించిన అపర మేధావి,ఆధ్యాత్మిక వేత్త ఆచార్య చాణక్యుడు. జీవితాన్ని ఎలా గడపాలో చెప్పిన వ్యక్తి. ఇందుకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన చాణక్యనీతిలో పేర్కొన్నారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు స్త్రీలు ఎలా ఉండాలి.. స్త్రీలకు ఉంవవలసిన లక్షణాలు ఏంటనే విషయాలను సైతం ఆయన తన చాణక్య నీతిలో విశదీకరించారు.
సాధారణంగా ఎక్కడైనా భార్య ప్రవర్తన సరిగా లేని పక్షంలో కుటుంబం పరువు అంతా పోతుంది. అలాంటి సమయంలో భార్యను విడిచిపెట్టడమే మంచిదని చాణక్యనీతిలో చెప్పబడిందని తెలుస్తోంది. తప్పుడు స్త్రీతో చేసే సహవాసం జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే అటువంటి స్త్రీకి దూరంగా ఉండాలని చాణక్యుడు తన చాణక్యనీతిలో వెల్లడించారని తెలుస్తోంది.
భర్త కష్టాల్లో ఉన్న సమయంలో భార్య సపోర్ట్ ఇవ్వాలని చాణక్యుడు పేర్కొన్నారు. అలాగే అర్థాంగిని భర్త కూడా గౌరవించాలి. అలాగే భర్తను ఎక్కువగా ప్రేమించే సతీమణి తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుందంట. అటువంటి భార్య సాంగత్యం భర్త జీవితాన్నే మార్చేస్తుందని, అప్పుడు ఆ భర్త ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తాడని చాణక్యనీతిలో పేర్కొనబడింది.
ఏ కుటుంబంలో అయినా భార్య అసహనంతో కానీ, సంస్కారహీనంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం కచ్చితంగా నాశనం అవుతుందంట. అలాంటి ఫ్యామిలీలో ఎప్పుడూ సంతోషాలు, శాంతి ఉండవు. ఈ తరహాలోనే ఏ కుటుంబంలోనైనా మంచి భార్య సాంగత్యం భర్తను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా తోడ్పడుతుంది. కానీ తప్పుడు స్త్రీ సహవాసాన్ని చేసినట్లయితే ఆ భర్త జీవితం కచ్చితంగా నాశనం అవుతుందని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడిందని సమాచారం.