Chanakya Niti Woman: మనిషి జీవితంలో ఆడవారికి ప్రధాన స్థానం ఉంటుంది. తల్లిగా చెల్లిగా భార్యగా బహుముఖ పాత్రలు పోషించే ఆడదాని అవసరం మగవారికి ఎప్పుడు ఉంటుంది. చిన్నతనంలో తల్లిచాటు కొడుకుగా, ఎదిగే క్రమంలో తోబుట్టువులకు సహోదరుడుగా పెళ్లయ్యాక భర్తగా అతడు తన పాత్రలు మార్చుకుంటాడు. ఇలా ఆడదానితో మగవాడికి అవినాభావ సంబంధమే ఉంటుంది. ఆడది లేనిది మగాడు లేడు. మనిషి పుట్టుకకు మూల కారణమే ఆడది. దీంతో ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆడదాని గురించి ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు.

మన నిత్య జీవితంలో ఆడవారి పాత్ర గురించి చెప్పుకున్నాం కదా. వారి స్థానాన్ని బట్టి వరస మారుతుంది. ఆదరణలో అమ్మగా అనురాగంలో చెల్లిగా ఆప్యాయతలో అక్కగా జీవితంలో భార్యగా తన స్థానాన్ని మార్చుకుంటుంది. కానీ ఇలా ఎన్ని పాత్రల్లోకి మారినా మేధావులు ఆడవారిని మాత్రం వేరుగానే చూస్తారు. ఆడదాని గురించి ఎక్కువగా పట్టించుకోరు. వారి సహవాసం మంచిది కాదనే వారి అభిప్రాయం. చాణక్యుడు ఆడవారిని గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిపాడు. వారిని అసలు నమ్మకూడదని కూడా చెబుతుంటాడు.
మనిషి పుట్టుక ఆడవారితోనే జరుగుతుంది. ఆడవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వివరించాడు. అందానికి ప్రాధాన్యం ఇచ్చే స్త్రీలను వివాహం చేసుకుంటే మనకు కష్టాలు తప్పవు. అణకువ, సహనం గల వారిని పెళ్లి చేసుకుంటే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఇంకా డబ్బు మీద ధ్యాస ఉన్న వారిని చేసుకుంటే అంతే సంగతి. వారు ఎప్పుడు డబ్బుల కోసమే పరితపిస్తుంటారు. ఆడవారిని జీవిత భాగస్వామిగా చేసుకునే క్రమంలో వారి తల్లిదండ్రుల గుణగణాలు లెక్కలోకి తీసుకుంటే మంచిది.

మనిషి మనుగడకు ఆధారమైన ఆడవారి విషయంలో చాణక్యుడు సూచించిన మార్గాలు ఆచరణీయం. ఇప్పటికి కూడా అతడు సూచించిన విషయాలు మనకు ఆధారంగా నిలుస్తున్నాయి. భవిష్యత్ ను ఊహించి అతడు చెప్పిన నిజాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో చాణక్యుడు చెప్పిన విషయాల ఆధారంగా ఆడవారి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన జీవితమే నరకంగా మారుతుంది. డబ్బును, ఆడవారిని అంత తేలిగ్గా నమ్మొద్దని చాణక్యుడు చెప్పాడు.