Chanakya Niti House: ఆచార్య చాణక్యుడు మన జీవన విధానం గురించి చెప్పాడు. మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో కూడా సూచించాడు. మనకు అనువైన పరిస్థితులు ఉండే చోట మాత్రమే ఇల్లు కట్టుకుంటే మంచి లాభాలుంటాయి. అంతేకాని ఎక్కడపడితే అక్కడ ఇల్లు కట్టుకుంటే ప్రతికూల ప్రభావాలే వస్తాయి. ఈ నేపథ్యంలో చాణక్యుడు ఐదు చోట్ల ఇల్లు కట్టుకోవద్దని సూచించాడు. అవేంటో తెలుసుకుని మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ఉపాధి
మనకు ఉపాధి లభించే చోట మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. మనకు పని దొరకని ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే పూట గడవడం కష్టంగా మారుతుంది. జీవనోపాధి లేకపోతే కష్టాలు తప్పవు. చాణక్యుడి ప్రకారం మనం ఉపాధి దొరకని ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటే మన బతుకు దర్భరం అవుతుంది. పని లేకపోతే కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది.
విలువలు
ప్రస్తుతం రోజురోజుకు నైతిక విలువలు పతనమవుతున్నాయి. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. ప్రభుత్వాలు, చట్టం, సమాజంలో విలువలు లేకపోతే మనుగడ కష్టం. విలువలు లేకపోతే మనకు కూడా విలువ ఉండదు. నిరంకుశం, అరాచకం ఉన్న చోట మానవత్వానికి తావుండదు. విలువలు లేని చోట ఇల్లు కట్టుకుంటే మనకు ఇబ్బందులు రావడం సహజం.
దానధర్మాలు
మనుషుల్లో దయాగుణం కనిపించడం లేదు. మన ధర్మంలో దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని తెలిసినా ఎవరు కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దానాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయని చెబుతున్నారు. దయ ఉన్న వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సనాతన ధర్మంలో దానధర్మాలకు ప్రాధాన్యం ఉంటుంది.
త్యాగం
అందరిలో సేవా గుణం తగ్గుతోంది. దాతృత్వం ఉన్న వ్యక్తులు ఉండే ప్రాంతాల్లో ఉండటం వల్ల మనకు ఏదైనా కష్టం వచ్చినా మనకు సహాయ సహకారాలు లభిస్తాయి. దీని వల్ల మనకు మంచి అనుభూతి కలుగుతుంది. త్యాగంతో ఉండే వారు మన చెంత ఉంటేనే మనకు పనులు ముందుకు సాగుతాయి. త్యాగ గుణం ఉంటే వారితో మనకు బాగుంటుంది.
గౌరవం
గౌరవ మర్యాదలు ఉన్న చోట ఉంటే మనకు కూడా మంచి విలువ పెరుగుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకుంటే అవమానం, భయం ఉండదు. అవమానాలకు తావుండదు. ప్రశాంతత ఉంటుంది. మంచి వారు ఉండే చోట ఉంటే మనకు కూడా మంచితనం అలవాటవుతుంది. ఇలాంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకుని ఉండటం వల్ల మనకు కష్టాలు రాకుండా హాయిగా ఉండొచ్చు.