Sreemukhi: ఎంత చూపిస్తే అంత పాపులారిటీ అన్నట్లు పరిస్థితి తయారైంది. యాంకరింగ్ పద్ధతులు, సమీకరణాలు మారిపోయాయి. ఒకప్పుడు భాషపై పట్టు, అనర్గళంగా మాట్లాడే తెగువ, సమయస్ఫూర్తి బెస్ట్ యాంకర్ లక్షణాలుగా పరిగణించేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేదు. మొహమాటం లేకుండా స్కిన్ షో చేయగలిగితే చాలు. గ్లామరస్ యాంకర్స్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీ గౌతమ్ బుల్లితెరను ఏలేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని శ్రీముఖి ఎదిగింది. పరిశ్రమలో అడుగుపెట్టిన అనతికాలంలో స్టార్ హోదా పట్టేసింది.
ఇప్పుడు బుల్లితెర మీద హవా శ్రీముఖిదే. లెజెండరీ యాంకర్ సుమ కూడా షోలు తగ్గించేశారు. ఒకటి రెండు మినహాయిస్తే ఆమె నెమ్మదించారు. అలాగే అనసూయ యాంకరింగ్ పూర్తిగా మానేశారు. ఈ పరిస్థితులు శ్రీముఖికి బాగా కలిసి వస్తున్నాయి. అరడజనుకుపైగా షోలతో బిజీ యాంకర్ అయ్యారు. తాజాగా నీతోనే డాన్స్ పేరుతో ఒక షో మొదలైంది. ఇది సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో. హీరోయిన్స్ సదా, రాధాలతో పాటు తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.
నీతోనే డాన్స్ షోలో శ్రీముఖి గ్లామర్ హైలెట్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో శ్రీముఖి స్కిన్ షో హద్దులు దాటేస్తుంది. ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తుంది. తాజాగా గ్రీన్ కలర్ ట్రెండీ టాప్ ధరించి థైస్ చూపించింది. సదరు డ్రెస్ లో శ్రీముఖిని చూస్తే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అనిపిస్తుంది. ఇక శ్రీముఖి బోల్డ్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
మరోవైపు శ్రీముఖి నటిగా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే అనేక చిత్రాల్లో శ్రీముఖి చిన్న చిన్న పాత్రలు చేశారు. క్రేజీ అంకుల్ మూవీలో హీరోయిన్ గా నటించారు. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి కీలక రోల్ చేసినట్లు సమాచారం. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటున్నారట. చిన్నా చితకా చిత్రాలు చేయడం వలన ప్రయోజనం ఉండదని భావిస్తున్నారట. రానున్న కాలంలో శ్రీముఖి నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ ఊహించవచ్చు. ఆమె ఫ్యాన్స్ వెండితెర మీద రాణించాలని కోరుకుంటున్నారు.