Chanakya Niti: నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. మంచి మాటలతో, మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకోవచ్చు. వారి వద్ద మంచి మార్కులను పొందవచ్చు. ఒక్కో వ్యక్తికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. అలా అందరిని ఆకట్టుకోవాలంటే ఒకే స్టాటజీ పని చేయదు. మరి ఇతరులను ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? ఈ విషయంలో చింత అవసరం లేదు. చాలా తొందరగా, తెలివిగా ఇతరులను ఆకట్టుకోవచ్చు. దానికి చాణుక్యుడు చెప్పిన కొన్ని మాటలను తెలుసుకుంటే చాలు. మరి ఓ సారి ఈ కింద ఉన్న చాణక్య మాటలను తెలుసుకోండి..
ఈయన చెప్పిన మాటల ప్రకారం.. మన చుట్టూ చాలా మంది ప్రజలుంటారు. అందులో కొందరు అత్యాశపరులు, మరికొందరు ధైర్యవంతులు, కొందరు తెలివిగలవారు, మరికొందరు మూర్ఖులు కూడా ఉంటారు. కానీ ఈ అందరినీ ఆకట్టుకోవడానికి కచ్చితంగా ఒక మార్గం ఉంటుంది. ఇందులో అత్యాశపరులను ఆకట్టుకోవడం చాలా సులభం. వీరికి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు ఆశించేదానికంటే కాస్త ఎక్కువ ఇస్తే చాలు. చాలా సులభంగా మీ దారిలోకి వచ్చేస్తారు.
మూర్ఖులను ఆకట్టుకోవడం కూడా సులభమే. వారి గర్వానికి మర్యాద ఇవ్వడం.. వారు చెప్పే మాటలను అంగీకరించడం.. వారు చెప్పేవి సరైనవే అని చెప్పడం వంటివి చేస్తే ఈజీగా మీ దారిలోకి వస్తారు. వీరిని మీ దారిలోకి రప్పించే మరో ఆయుధం ముఖస్తుతి. ప్రశంసల ద్వారా వారి నుంచి మీకు కావాల్సింది రాబట్టవచ్చు. బుద్దిమంతులను మెప్పించడం అంత ఈజీ కాదు. వీరిని ఆకర్షించాలంటే వారితో నిజం మాత్రమే చెప్పాలి. సత్యాన్ని మించిన శక్తి లేదని వీరిని ఆకర్షించడం కోసం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యం సూత్రం.
డబ్బుకు ప్రాముఖ్యతనిచ్చే వారికి తగినంత డబ్బుతో కొనవచ్చు. అంతే మీకు వీరు బానిస అవుతారు. అయితే ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలను తెలిపారు చాణుక్యుడు. అతి నిజాయితీ ప్రమాదకరమని.. దీని వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే సరిగా ఉన్న చెట్టునే మొదట నరికివేస్తారు. ఇక భయం మీ దగ్గరకు వచ్చినప్పుడు దాడి చేయడం, నాశనం చేయడం కూడా అలవాటు చేసుకోండి. కొన్ని సార్లు మీ అలవాట్లను, మంచితనాన్ని చూసి కూడా ఇతరులు ఆకర్షితులవుతారు.