Chanakya nithi: చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని చెప్పిన నీతి వాక్యాలకు (Moral sentences) చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్(Inspiration) అయిన అతను నీతి వాక్యాలు ఎందరినో మంచి మార్గంలో నడిపించాయి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలంటే తప్పకుండా చాణక్య నీతి (Chanakya Nithi) ఉపయోగపడుతుంది. చాణక్యుని కొన్ని నీతి సూత్రాలు వ్యాపారం (Business), సంబంధాలు (Relations), స్వీయ-క్రమశిక్షణ వంటి వాటి గురించి చెబుతోంది. ఇలాంటి విషయంలో ఎలాంటి సమస్యలను అయిన కూడా అధిగమించాలంటే మాత్రం తప్పకుండా చాణక్య నీతి (Chanakya Nithi) ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. ఎందరో కూడా చాణక్య నీతి గురించి తెలుసుకుంటున్నారు. అయితే జీవితంలో ఒక ఐదు విషయాలను తెలుసుకుంటే తప్పకుండా ప్రతీ విషయంలో విజయం తప్పకుండా సిద్ధిస్తుందట. ఆ ఐదు సూత్రాలు జీవితంలో ఉన్నత స్థితికి చేర్చుతాయి. మరి ఆ ఐదు సూత్రాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మాట్లాడే ముందు ఆలోచించాలి
కొందరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఇలా ఉంటే ఇతరుల మధ్య చులకన అయిపోతారు. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పకుండా ఆలోచించాలి. ప్రతీ మాట ముందు ఆలోచించి నడుచుకోవాలి. అప్పుడే మీకు ఇతరుల దగ్గర గౌరవం ఉంటుంది. ఏ విషయాన్ని అయిన కూడా ఆలోచించుకున్న తర్వాత ఎవరైతే చేస్తారో.. వారు తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని చాణక్య నీతి చెబుతోంది.
చదువు ఉండాలి
ఎంత పేదవాడిని అయిన కూడా ధనవంతుడిని చేసేది చదువు. అంటే వ్యాపారాలు చేసేవారు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కదా.. అని మీరు అనుకోవచ్చు. అయితే చదువుకున్న వాడికి కాస్త ఎక్కువ విలువ ఉంటుంది. ఎప్పటికీ కూడా విద్యావంతుడు పేదవాడు కాదని చాణక్య నీతి చెబుతోంది.
ఇతరులతో మంచిగా వ్యవహరించాలి
కొందరు ఒక్కో మనిషితో ఒక్కోలా వ్యవహరిస్తారు. ఇష్టమైన వ్యక్తులతో ఒకలా, ఇష్టం లేని వ్యక్తులతో వ్యవహరిస్తుంటారు. ఎవరి బలం, బలహీనతలు అనేవి వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయని చాణక్య నీతి చెబుతోంది. ఇతరులను మార్చాలంటే ముందు మనం మారాలి. మనం మారితేనే ఇతరులు కూడా మారుతుంటారు.
శత్రువులను జయించగల శక్తి ఉండాలి
కొందరు ఇతరులను జయించే శక్తి ఉన్నా కూడా భయపడుతుంటారు. ఇలాంటి వారు జీవితంలో ప్రతీ విషయానికి భయపడుతుంటారు. ఇలా కాకుండా ప్రతీ విషయానికి భయపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్లిన వారే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు.
రహస్యాలను ఉంచుకోవాలి
కొందరు అన్ని విషయాలను ఇతరులతో పంచుకుంటారు. ప్రతీ విషయాన్ని కూడా అందరితో పంచుకోవద్దు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలనే విషయాన్ని గుర్తించుకోండి. ఏ విషయాన్ని ఎవరితో ఎంత వరకు షేర్ చేసుకోవాలో తెలిసి ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. కాబట్టి ఇతరులతో ఎంత లిమిట్‌లో ఉండాలో అంత వరకు మాత్రమే ఉండాలి. ఈ విషయాలు మీకు తెలిస్తే లైఫ్‌లో మీకు అన్నింటి విజయం తథ్యమే.