Chanakya Neeti: కుటుంబ సంబంధాలపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. కుటుంబ సంబంధాలు మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తాయి. కుటుంబంలో పెద్దలు, పిల్లలు, భార్యాభర్తలు ఉంటారు. దీంతో వారి మధ్య సంబంధాలు కూడా ఉంటాయి. కానీ వారికి భాష, బంధాలపై ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వైవాహిక జీవితంలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. జీవితం సుఖంగా సాగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. చాణక్యుడు చెప్పిన విషయాలు తెలుసుకుంటే మనకు ఎన్నో దారులు కనిపిస్తాయి.

కుటుంబంలో పిల్లల ముందు మన భాష మంచిగా ఉండాలి. లేకపోతే వారు మన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. మనం మాట్లాడే భాష మంచిగా లేకపోతే అదే వారికి అలవాటు అయిపోతుంది. ఫలితంగా దుర్భాషలే వస్తాయి. దీంతో మన ఆచారాలు, అలవాట్లు బాగా వంట పట్టించుకుంటారు. అందుకే పిల్లల ఎదుట ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. కొన్ని పనులు కూడా చేయొద్దు. పిల్లల ముందు ఎంత బాగా నడుచుకుంటే వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.
పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. వారు ఏం మాట్లాడితే అది మాట్లాడతారు. ఎలా నడుచుకుంటే అలా ప్రవర్తిస్తారు. పిల్లలు పెద్దవారిని బాగా అనుకరిస్తారు. దీంతో వారి ముందు ఎంత వరకు బాగా నడుచుకుంటే వారు కూడా అదే దారిలో నడుస్తారు. పిల్లల ముందు గొడవలు పెట్టుకోకూడదు. పొగతాగడం, మద్యం సేవించడం వంటి పనులు చేయడం కూడా మంచి పని కాదు. అత్యంత జాగ్ర్తత్తలు పాటిస్తేనే వారికి మంచి దారి చూపించిన వారం అవుతాం. లేదంటే వారు చెడిపోయేందుకు కూడా కారకులమవుతాం.

పిల్లల ఎదుట అబద్ధాలు ఆడకూడదు. మనం ఒకవేళ అలాంటి పనులు చేస్తే వారికి మనమే మార్గదర్శకులం అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవం కాపాడుకునే క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. పిల్లల భవిష్యత్ గాడి తప్పకుండా చూసుకోవాలి. అది మన బాధ్యతే. దీంతో పిల్లలను సరైన దారిలో పెంచడానికి మనం కూడా మంచి దారిలో వెళితేనే ప్రయోజనం. గౌరవం కూడా అవసరమే. మనం చిన్న వారిని ప్రేమిస్తే వారు మనల్ని గౌరవిస్తారు. పిల్లలకు గౌరవం అలవాటు చేయడం కూడా ఓ ఆభరణం లాంటిదే.