https://oktelugu.com/

Chanakya Niti: భర్తతో భార్య సంతోషంగా ఉండాలంటే… ఈ విషయాలను తప్పక పాటించాలి..

పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ భర్త తనకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే భర్త సైతం తన భాగస్వామికి అనుగుణంగా ఉండడంవల్ల సంతోషంగా ఉండగలుగుతారు వీటిలో మొదటిది నమ్మకం.

Written By: , Updated On : February 15, 2025 / 05:00 AM IST
Chanakya Niti

Chanakya Niti

Follow us on

Chanakya Niti: రాజనీతి తత్వవేత్త అపర చాణక్యుడు కేవలం రాజ్యానికి సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు చాలామంది ఈ సూత్రాలను పాటిస్తూ వస్తున్నారు. చాణక్యుడు దాంపత్య జీవితంపై కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొన్నాడు. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో పకడ్బందీగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు. ముఖ్యంగా భార్యతో భర్త సంతోషంగా ఉండాలంటే భర్త కొన్ని విషయాలను భార్యకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నాడు. అయితే ఏ విషయాల్లో తన భాగస్వామికి అనుగుణంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ భర్త తనకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే భర్త సైతం తన భాగస్వామికి అనుగుణంగా ఉండడంవల్ల సంతోషంగా ఉండగలుగుతారు వీటిలో మొదటిది నమ్మకం. జీవిత భాగస్వామి కి తనమీద నమ్మకం ఏర్పడే విధంగా వ్యవహరించాలి. ఒక్కోసారి జీవిత భాగస్వామి తన రహస్యాలను భర్తకు చెబుతూ ఉంటుంది. ఈ రహస్యాలను బయట ఎక్కడ ప్రస్తావించకుండా ఉంటే భర్తపై నమ్మకం ఏర్పడుతుంది. ఇలా నమ్మకంగా ఉండడం వల్ల తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకోగలుగుతుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్న భర్త తో తాను సంతోషంగా ఉండాలని అనుకుంటుంది.

ప్రతి స్త్రీ తన భర్తకు సమాజంలో గుర్తింపు ఉండాలని కోరుకుంటుంది. అయితే అంతకుముందు తనతో మర్యాదగా ప్రవర్తిస్తున్నాడా? లేదా? అనే లక్షణాన్ని చూస్తుంది. తనతో మర్యాదగా ప్రవర్తించే భర్తను స్త్రీ ఎక్కువగా ఇష్టపడుతుంది. తనకు అనుగుణంగా ఈ లక్షణం కలిగి ఉండడంతో ఆమె ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉంటుంది. పురుషులు సమాజంలో మాత్రమే కాకుండా తన జీవిత భాగస్వామితో మర్యాదగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు సాధ్యం కాకపోయినా ఆ తర్వాత వారిని బుజ్జగించడం వల్ల వారు తమ కు అనుగుణంగా ఉంటారు.

పెళ్లయిన ప్రతి స్త్రీ తనకు సంబంధించిన విషయాలను, కష్ట నష్టాలను భర్తతో మాత్రమే షేర్ చేసుకుంటుంది. అయితే ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు భర్త చికాకు కలిగించుకోవడం లేదా వినకపోవడం వంటివి చేయడం వల్ల అతనిని దూరం పెడుతుంది. అయితే తనకు సంబంధించిన విషయాలను చెప్పినప్పుడు ఓపికతో వినడం వల్ల తనకు అనుగుణంగా ఉంటున్నాడని అనుకుంటుంది. అందువల్ల పురుషులు తన జీవిత భాగస్వామి చెప్పే అన్ని విషయాలను ఓపికతో వినాలి. ఆ తర్వాత ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏంటో చూడాలి. అప్పుడు తన భర్తతో సంతోషంగా ఉండడానికి జీవిత భాగస్వామి వెనకాడదు.

చాలామంది పురుషులు తమ జీవిత భాగస్వామికి ఏదేదో చేస్తారని హామీ ఇస్తారు. కానీ ఆ తర్వాత పట్టించుకోరు. అయితే తన జీవిత భాగస్వామి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే భర్తను స్త్రీ ఎక్కువగా లైక్ చేస్తుంది. ఇలాంటి వారితో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే పురుషులు సైతం తన జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండడానికి ఈ విషయంలో వారికి అనుగుణంగా ఉండడం మంచిది. ఇలా కొన్ని విషయాల్లో భార్యకు అనుగుణంగా ఉండడం వల్ల వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు తెలిపారు.