Car Tips : కారున్న ప్రతిఒక్కరూ, నడిపే డ్రైవర్లంతా దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. చాలాసార్లు సరైన సమాచారం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు చేస్తాం. దానివల్ల కారు ఇంజిన్ జీవితకాలం తగ్గిపోతుంది. చాలామంది “కారు కొని కొన్నేళ్లు కాకముందే ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి” అని అనడం మీరు వినే ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక కారణం ఏమిటి? పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మనకు తెలియకుండానే మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల కారు ఇంజిన్ లైఫ్ పెరగడానికి బదులు తగ్గిపోతుంది. చాలామంది కారు స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్ ఇచ్చి ముందుకు వెళ్లిపోతారు. కానీ అలా చేయడం కారు లైఫ్ కు మంచిదేనా ఇందుకు సమాధానం తెలుసుకోవడానికి దగ్గర్లోని మంచి మెకానిక్ ను అడిగితే చెబుతారు. వారు చెప్పిన దాని ప్రకారం.. కారు స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్ ఇవ్వడం వల్ల ఇంజిన్ లైఫ్ తగ్గుతుంది. చాలామంది ఉదయం పనికి వెళ్ళే తొందరలో కారు స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్ ఇచ్చి డ్రైవ్ చేయడం ప్రారంభిస్తారు.
Also Read : కారు ఆగిపోయిందా? టెన్షన్ వద్దు.. ఫ్రీ సర్వీస్ కోసం ఇలా చేయండి
వాళ్లు తమకు ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి 2 నిమిషాలు కేటాయించే అలవాటు చేసుకోవాలని, దానివల్ల వారికే లాభం ఉంటుందని అన్నారు. కారు స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలు డ్రైవ్ చేయకుండా ఆగితే ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా, కారులో ఉపయోగించే మెకానికల్ పార్ట్స్ పాడయ్యే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. కారు స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఆగడం వల్ల ఇంజిన్ ఆయిల్ అన్ని పార్ట్లకు సరిగ్గా చేరుతుంది.. ఇంజిన్ కూడా వేడెక్కుతుంది. కాబట్టి కారు స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఆగడం చాలా మంచిది.
Also Read : వేసవిలో ఈ తప్పులు చేస్తే కారులో మంటలు వస్తాయి జాగ్రత్త !