Car Fog: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. వీటితో పాటు పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ పొగ మంచు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అయితే పొగ మంచు వల్ల చలికాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు పొగమంచు కారణంగా జరుగుతున్నాయి. ఈ చలి కాలంలో పొగమంచు వల్ల డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతారు. పగలు సమయాల్లో కూడా పొగమంచు పడితే రోడ్డు మీద ఏ వాహనం ఉన్నా సరిగ్గా కనిపించదు. చలి కాలంలో ఉదయం 9 అయిన కూడా కొన్ని ప్రదేశాల్లో మంచు పడుతూనే ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది పడుతుంది. దీనికి తోడు వాహనాలకు విండ్ షీల్డ్‌పై పొగ మంచు నిండిపోతుంది. దీనివల్ల ఇంకా ప్రమాదాలు పెరిగిపోతుంటాయి. దీన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసిన కూడా ఈ సమస్య పెరిగిపోతుంది. మరి దీన్ని క్లియర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కారులో ప్రయాణించేటప్పుడు విండ్ స్క్రీన్‌పై పొగమంచు ఎక్కువగా ఏర్పడకుండా నిరోధించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కొందరు కారులో ప్రయాణించేటప్పుడు లోపల హీటర్‌ను ఎక్కువ సమయం ఆన్‌లో ఉంచుతారు. ఇలా ఉంచి డ్రైవ్ చేయడం వల్ల పొగమంచు పెరుగుతుంది. ఇలా డైవ్ చేయడం సరి కాదని నిపుణుు అంటున్నారు. అలాగే కారు లోపల ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండటం వల్ల తేమ ఏర్పడుతుంది. దీంతో కారు విండ్ స్క్రీన్‌పై పొగమంచు ఏర్పడుతుంది. దీంతో మీ ముందు వాహనాలు, మనుషులు ఉన్నా చూసుకోలేరు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో అద్దాలపై పడిన పొగమంచు నుంచి విముక్తి చెందాలంటే ఎయిర్ కండీషనర్ ఆన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కారు విండ్ స్క్రీన్‌పై పొగమంచు పెరగకుండా ఉంటుంది. ఇలా ఆన్ చేయడం వల్ల బయట ఉష్ణోగ్రతకు లోపల ఏసీ ఉష్ణోగ్రత సరిగ్గా సరిపడుతుంది. దీంతో కొంత వరకు ప్రయాణాల్లో పొగమంచు రాదు.
చలికాలంలో ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే పొగమంచు వల్ల కొంచెం కనిపించకపోయిన కూడా ఘోర ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో ప్రయాణాలు పెట్టుకోవద్దు. అవసరమైతే సూర్యరశ్మి వచ్చిన తర్వాత చేయడం మంచిది. దీనివల్ల కొంత వరకు ప్రమాదాలు తగ్గుతాయి. అదే మంచులో చేస్తే ఇంకా పొగమంచు పెరిగి రహదారి కనిపించక ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.