Sleep Problems: మనిషికి నిద్ర చాలా అవసరం. తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటీవల కాలంలో రాత్రుళ్లు తినడం తెల్లవార్లు నిద్రపోవడం అలవాటుగా చేసుకుంటున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటోంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. రోజు మనిషి సగటున 6-8 గంటలు నిద్ర పోవాల్సిందే. లేదంటే రోగాల బారిన పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర పోయేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ఎంత తీసుకుంటున్నామో నిద్ర కూడా అలాగే పోయేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బ్యాలెన్స్ గా ఉంటుంది. లేదంటే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటే అనర్థాలు వస్తాయి.

కొందరంటారు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలి. టీ, కాఫీలు మానేయాలి. ఫోన్లు పక్కన పెట్టాలి. రాత్రుళ్లు ఫోన్లతో ఆడుకుంటే నిద్ర సక్రమంగా పట్టదు. మంచి సంగీతం వింటే నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. ఇంకా పుస్తక పఠనం మంచిదే. గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చక్కనైన నిద్ర మన సొంతం అవుతుంది. ఇలా నిద్ర పోయేందుకు కావాల్సిన వనరులను మనమే సమకూర్చుకుంటే ఫలితం వస్తుంది.
సరిగా నిద్ర లేకపోతే ఒత్తిడికి గురవుతాం. ఏకాగ్రత లోపిస్తుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. చిరాకు కలుగుతుంది. చీటికి మాటికి కోపం వస్తుంది. ఇన్ని దుష్పరిణామాలకు నిద్ర లేకపోవడమే కారణంగా మారుతుంది. డయాబెటిస్, రక్తపోటు వంటి రోగాలు రావడానికి దోహదపడుతుంది. అందుకే నిద్ర పోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. నిద్రలో మన అవయవాలు అన్ని కూడా విశ్రాంతి తీసుకుంటాయి. ప్రతి రోజు సరైన సమయంలో మంచి నిద్ర పోతేనే మనకు ఎలాంటి ఇబ్బందులు రావని గుర్తుంచుకోవాలి.

మనుషులైనా జంతువులైనా సరైన నిద్ర లేకపోతే మనుగడ కష్టమే. నిద్ర పోయేందుకు సరైన పరిస్థితులు కల్పించుకోవాలి. ఆరోగ్య పరిరక్షణలో నిద్రకు ప్రాధాన్యం ఉంటుంది. ఏ వయసు వారైనా నిద్రకు తగిన సమయం కేటాయించుకోవాల్సిందే. లేకుంటే పలు రోగాలకు కారకులవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తిండితోపాటు నిద్ర కూడా మనకు అత్యంత అవసరమే. దీంతో నిద్ర పోయేందుకు అనువైన విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే సరైన నిద్ర పడుతుంది. నిద్రలో మన అవయవాలు కూడా విశ్రాంతి తీసుకుని లేచిన తరువాత వాటి పనితీరు మెరుగుపడుతుంది.