
Maruti Alto 800 : దేశీయ కార్ల తయారీలో దిగ్గజం మారుతి సుజుకి. రికార్డు స్థాయిలో కార్లను ఉత్పత్తి చేసి విక్రయించిన ఘనత ఈ కంపెనీ సోంతం. మధ్యతరగతి ప్రజల నుంచి యూత్ ఆకర్షించే రేంజ్ లో మోడళ్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ నుంచి వెలువడిన ‘ఆల్టో800’ కొత్త కారును కొన్ని రోజుల తరువాత చూడలేమని తెలస్తోంది. ఎందుకంటే ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మధ్య తరగతి వారికి అనుగుణంగా తయారు చేయబడ్డ ఆల్టో 800 చిన్న ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అందుకే దీనిని ఎక్కువ మంది ఆదరించి కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడీ మోడల్ ఆగిపోనుందన్న సమాచారంపై తీవ్రంగా చర్చ సాగుతోంది.
2000 సంవత్సరంలో మారుతి సుజుకి ‘ఆల్టో 800’ లాంచ్ అయింది. 796 సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు 2010 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ పదేళ్లలో 17 లక్షల కార్లు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ తరువాత ఆల్టో K10 భారత మార్కెట్లోకి విడుదలయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 9.5 లక్షలు ఇవి అమ్ముడు పోవడం చూస్తే ఆల్టో ఆదరణ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆల్టో 800 ఉత్పత్తి నిలిపివేసినా K10 ఉత్పత్తి కొనసాగుతుందని ప్రకటించారు.

ఆల్టో 800 K10 ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర రూ.3.99 లక్షల నుంచి రూ.8.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి వెబ్ సైట్ ఆల్టో 800 ధర రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల మధ్య ఉంది. అయితే మారుతి 800 ను అప్ గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో పాటు రోడ్ టాక్స్ పెరగడం, మెటీరియల్ ధర , ఇతర పన్నులు అధికం కావడంతో వీటి ఉత్పత్తికి కారణమని తెలుస్తోంది.
అదీ గాక BS 6 ఫేజ్ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయడం సాధ్యం కాదని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు. అయితే ఎంతో మందికి అనుకూలంగా ఉన్న ఆల్టో 800 ఉత్పత్తి నిలిపివేయడం రకరకాలు చర్చ సాగుతోంది. ఈ మోడల్ వల్ల మధ్య తరగతి పీపుల్స్ కారులో తిరిగి తమ వాంచ తీర్చుకున్నారని అంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో మరికొన్ని ఇలాంటి కార్లను ఉత్పత్తి చేయాలని కోరుతున్నారు.