https://oktelugu.com/

Cancer: ఈ యోగాసనాలు డైలీ చేస్తే.. ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి తథ్యం

క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. దీని బారిన పడితే మరణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన నుంచి తప్పించుకోవాలంటే వ్యాయామం, యోగా వంటివి తప్పకుండా చేయాలి. వీటివల్ల బాడీకి శారీరక శ్రమ అందుతుంది. దీంతో ఈ సమస్యల నుంచి విముక్తి చెందుతారు.

Written By: Kusuma Aggunna, Updated On : November 19, 2024 10:08 pm

cancer

Follow us on

Cancer: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన చాలా మంది పడుతున్నారు. చిన్న పెద్ద అని వయస్సుతో సంబంధం లేకుండా మరణిస్తున్నారు. వీటిన్నింటికి ముఖ్య కారణం శారీరక శ్రమ లేకపోవడం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడమే అని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. దీని బారిన పడితే మరణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన నుంచి తప్పించుకోవాలంటే వ్యాయామం, యోగా వంటివి తప్పకుండా చేయాలి. వీటివల్ల బాడీకి శారీరక శ్రమ అందుతుంది. దీంతో ఈ సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అయితే కొన్ని యోగాసనాలను డైలీ వేయడం వల్ల ఈజీగా క్యాన్సర్ సమస్య నుంచి తప్పించుకుంటారు. మరి ఆ యోగాసనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

యోగేంద్ర పర్వతాసన
ఈ యోగాసనం వేయడం వల్ల పొత్తి కడుపులో ఉండే అవయవాలకు రక్తం అందుతుంది. దీనివల్ల క్యాన్సర్‌ కారకాలను నాశనం చేస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యోగాసనం వేయడం వల్ల విముక్తి చెందుతారు. అయితే ఈ యోగాసనాన్ని మొదటిగా హాయిగా కూర్చోని ఊపిరి పీల్చుకోవాలి. ఆ తర్వాత అరచేతులను కలిపి పైకి ఎత్తాలి. అలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉండి, మళ్లీ చేయాలి. ఇలా చేయడం వల్ల తొందరగా క్యాన్సర్ నుంచి విముక్తి చెందుతారు.

యోగేంద్ర పవనముక్తాసన
ఈ యోగాసనాన్ని వెనుక పడుకుని మోకాళ్లను చేతలతో పట్టుకుని ఛాతీ వరకు తీసుకురావాలి. ఊపిరి పీల్చుకుంటూ కాళ్లను పట్టుకోవాలి. రోజూ ఒక పది నిమిషాలు అయిన చేయడం వల్ల గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో బాగా సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్‌ను నివారించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

యోగేంద్ర శవాసన
రివర్స్‌లో పడుకుని మీ శరీరానికి ఒక అడుగు దూరంలో మీ చేతులను చాచి, కాళ్లు కాస్త దూరంగా ఉంచాలి. ఇలా అరచేతులను పైకి ఎదురుగా ఉంచి కళ్లు మూసుకుని ఊపిరి పీల్చుకోవాలి. ఇలా కదలకుండా ఉండటం వల్ల శరీరంలోని అవయవాలు సాగుతాయి. దీనివల్ల వాపు, ఇతర క్యాన్సర్ వంటి సంబంధిత ప్రమాదాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి కల్పించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ యోగాసనం బాగా ఉపయోగపడుతుంది.

యోగేంద్ర ప్రాణాయామం
సాధారణంగా పడుకుని మోకాళ్లను, తుంటిని దగ్గరకి లాగాలి. ఒక చేతిని పొత్తికడుపుపై ఉంచి మరొక చేతిని శరీరం పక్కన ఉంచండి. కళ్లు మూసుకుని ఊపిరి పీల్చాలి. ఇలా ఒక పది నిమిషాల పాటు చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.

యోగేంద్ర ప్రాణాయామం
వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోని ఊపిరి పీల్చాలి. కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లతో పట్టుకుని ఊపిరి పీల్చుతుండాలి. ఇలా పట్టుకుని, వదులుతూ పీల్చుతుంటే.. క్యాన్సర్ కారకాలు నాశనం అవుతాయి. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి చెందుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.