Betel Leaf Plant: మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. చెట్లలో అయితే వేప, మారేడు, రావి, మర్రి, ఉసిరి చెట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వాటితో మందులు తయారు చేస్తారు. వాటి ఆకులను వినియోగించి ఎన్నో రోగాలకు ఉపశమనం లభించే మందులు తయారు చేయడం తెలిసిందే. ఆయుర్వేదంలో వాటికున్న విలువ ఏంటో మనకు విధితమే. అంతటి మంచి చెట్లను మనకు ప్రసాదించిన ప్రకృతి వాటి ఆకులతో కూడా ఎన్నో విధాలైన లాభాలు కలుగజేస్తోందనడంలో సందేహం లేదు.

ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికే కాకుండా దైవభక్తికి కూడా తమలపాకులు ఉపయోగించడం చేస్తుంటాం. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అంటే చాలా ఇష్టం. అందుకే మంగళ, శనివారాలు స్వామి వారిని తమలపాకులతో కప్పుతారు. దీంతో మనకు మరింత పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తమలపాకులకు అంతటి విశిష్టత వచ్చింది. దీంతో వాటిని మనం పూజల్లో కూడా విరివిగా ఉపయోగిస్తాం.
ఇక ఇళ్లల్లో కూడా తమలపాకుల చెట్లు పెంచుతుంటారు. కానీ వాటిని కేవలం పూజకే వినియోగించుకోవాలని కొందరు చెబుతుంటారు. పూర్వం రోజుల్లో అయితే తాంబూలం వేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. ప్రతి రోజు భోజనం అయ్యాక భార్యాభర్తలు సంబరంగా చిలకలు చుట్టి ఇచ్చుకునేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ఆ ఆచారం కనిపించడం లేదు. తమలపాకుల వాడకంతో మహిళలకు కాల్షియం సమస్య పోతుంది. తమలపాకులో వాడే సున్నం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది.

ప్రతి పూజ, వ్రతంలో తమలపాకును వినియోగిస్తాం. ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం శ్రావణంలో ఆచారం. శ్రావణంలో లక్ష్మిపూజ చేసుకున్న మహిళలు ఇంటికి వచ్చిన మహిళలకు తమలపాకుతో పాటు జాకెట్ బహుమానంగా అందజేయడం తెలిసిందే. దీంతో తమలపాకుకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తోంది. తమలపాకు మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఇస్తోంది. ఆహారం అరగడానికి కారణమవుతుంది. గొంతులో కఫాన్ని తగ్గిస్తుంది. అందుకే తమలపాకును దైవాంశ సంభూతంగా భావిస్తున్నాం. దీంతో తమలపాకుకు ఉన్న ప్రయోజనాల రీత్యా దీని వాడకం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే తమలపాకు చెట్టును ఇంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే వాటిని వాడుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాలింతలు తమలపాకులు వాడకపోవడమే మంచిది. దేవుడికి పెట్టిన తరువాత మాత్రమే ఇతర అవసరాలకు వాడుకోవాలి. ఇవి పాటిస్తే తమలపాకు చెట్టు మన ఇంటిలో ఉంచుకోవడం శ్రేయస్కరమే అని తెలుసుకోవాలి.