https://oktelugu.com/

Tulsi : ఎలాంటి ఖర్చు లేకుండా ఇన్ని సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చా? ఎలాగంటే?

తులసి ఆకులను పవిత్ర తులసి అని కూడా పిలుస్తారు, ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన శక్తివంతమైన ఔషధ మొక్కగా భావిస్తారు ఆయుర్వేద నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 19, 2024 / 06:00 AM IST

    Tulsi

    Follow us on

    Tulsi : తులసి ఆకులను పవిత్ర తులసి అని కూడా పిలుస్తారు, ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన శక్తివంతమైన ఔషధ మొక్కగా భావిస్తారు ఆయుర్వేద నిపుణులు. ఈ ఆకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోజువారీ ఆరోగ్యం, శక్తి స్థాయిలలో చాలా మార్పును తీసుకురావచ్చు. కాబట్టి, ప్రతిరోజూ తులసి తినండి. ఇవి మాత్రమే కాదు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి చాలా పని చేస్తుంది. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్యానికి కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. గాయాన్ని నయం చేసే గుణం కూడా ఈ తులసికి ఉంది. తులిసి ఆకులలో ఉండే యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాలను నయం చేయడానికి, ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

    రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది తులసి. ఇది ప్యాంక్రియాటిక్ కణాల పనితీరుకు మద్దతు ఇచ్చే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది తులసి. తులసి ఆకులు ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు చికిత్స చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసి ఆవిరిని పీల్చడం వల్ల ముక్కులో, గొంతులోని రద్దీని శుభ్రపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

    ఒత్తిడిని తగ్గించడంలో కూడా తులసి బాగా పని చేస్తుంది. ఈ ఆకులలో అడాప్టోజెన్‌లు పుష్కలంగా ఉంటాయిజ. ఇవి శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తెలిపింది. చర్మానికి కూడా చాలా మంచిది. తులసి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. నిర్విషీకరణలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది తులసి. జలుబును నయం చేయడంలో కూడా బాగా పని చేస్తుంది. తులసి ఆకులు వాటి యాంటీ మైక్రోబియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి సాధారణ దగ్గు, జలుబు నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

    బరువు తగ్గడానికి కూడా ఈ తులసి ఆకులు సహాయం చేస్తాయి. తులసి ఆకులు జీర్ణక్రియ, నిర్విషీకరణలో సహాయపడతాయి కాబట్టి, అవి ఆటోమేటిక్‌గా అదనపు కిలోలను కోల్పోవడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. సర్వరోగ నివారణి అంటారు పెద్దలు. మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ తులసి చెట్టు ఎల్లప్పుడు ప్రాణవాయువును వదులుతుంది. అందుకే దీన్ని చాలా మంచిదని చెబుతుంటారు నిపుణులు. అందుకే ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచాలి. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. దీని ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించాలి. తులసి సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించే వారికి కాస్త వ్యాధులు కూడా తక్కువే వస్తాయి.