Homeబిజినెస్Business Tips: బిజినెస్ ముచ్చట్లు : టుడే క్రేజీ బిజినెస్ అప్ డేట్స్ !

Business Tips: బిజినెస్ ముచ్చట్లు : టుడే క్రేజీ బిజినెస్ అప్ డేట్స్ !

Business Tips: బంగారానికి రెక్కలు వచ్చేలా ఉన్నాయి. గత 10 రోజుల్లోనే తులం బంగారం వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. రూపాయి విలువ పడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపునకు మళ్లడంతో డిమాండ్‌ పెరుగుతోంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే ఏడాదిన్నరలో బంగారం ధర $2,000కు చేరే అవకాశం ఉన్నట్టు స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. మన లెక్కల్లో లక్షన్నర రూపాయల వరకు పలికే ఛాన్స్ ఉంది.

Business
Business

టాటా మోటర్స్ కి ఆటో మొబైల్ దిగ్గజం అనే ఘనమైన పేరు ఉంది. కాగా టాటా మోటర్స్ మరో వాహనంతో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం ఎస్యూవీ రకానికి చెందిన సఫారీ డార్క్ ఎడిషన్ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ కొత్త ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.19.05 లక్షలుగా నిర్ణయించింది. ఈ సఫారీ ‘డార్క్’ ఎడిషన్ లుక్ కూడా అదిరిపోయింది.

Also Read: సమంత’కి షరతులు.. అవి చెత్త, నేను పట్టించుకోను – నాగార్జున

Business
Business

అలాగే ప్రీమియం మోటార్సైకిల్ సంస్థ కేటీఎం మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రీమియం మోటార్సైకిల్ సంస్థ ‘కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ 2022 ఎడిషన్ ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ బైక్ కు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. 248 సీసీ ఉన్న ఈ టూవీలర్ ధర రూ. 2.35 లక్షలుగా ఉంది. మొత్తమ్మీద కేటీఎం నుంచి వచ్చిన ఈ సరికొత్త ‘అడ్వెంచర్’ బైక్ అదిరింది.

Also Read: థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

3 COMMENTS

  1. […] Earbuds:  మీకు తెలుసా ? ఇయర్‌ బడ్స్‌ కోసం నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. పైగా ఎక్కువమంది ఎక్కువసార్లు కొంటున్న ఐటమ్స్ లో ఈ ఇయర్‌ బడ్స్‌ కూడా ఒకటి అట. మరి అంత డిమాండ్ ఉన్న ఈ ఇయర్‌ బడ్స్‌ కి సంబధించి ఏది బెస్ట్, లేటెస్ట్ ఎదో చెప్పాలి కదా. అందుకే.. మీ కోసం ఇయర్‌ బడ్స్‌ లో కొత్త రకం సరుకు గురించి వివరంగా రాసుకొచ్చాం. మరి చదువుకోండి. నచ్చితే.. చక్కగా కొనుక్కోండి. […]

  2. […] Rise in commodity prices: కాదేది పెరగడానికి అనర్హం అన్నట్టుగా మారింది.  అగ్గిపుల్ల నుంచి సబ్బు బిల్ల వరకూ..  కూరగాయల నుంచి కార్ల వరకు ప్రతీ వస్తువు ధరలు పెరిగాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నామైంది. దీంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు వస్తువుల ధరలు పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్భణం ఏ ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అసలీ ధరలు పెరగడానికి కారణం ఏంటి..? 2008 నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇంతలా ఎందుకు పెరిగాయి..? అన్న దానిపై స్పెషల్ ఫోకస్.. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular