Homeఉద్యోగాలుBSNL Senior Executive Trainee 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ దరఖాస్తుల గడువు పెంపు..

BSNL Senior Executive Trainee 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ దరఖాస్తుల గడువు పెంపు..

BSNL Senior Executive Traine: ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి BSNL గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రకటించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లో భాగంగా గడువు తేదీని పొడగించారు. ఇప్పటి వరకు ఈ పోస్టుకులు మార్చి 31వ తేది డెడ్ లైన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 15 వరకు పొడగించారు. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకోలేనివారు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవచ్చు. Bharat Sanchar Nigam Limited లో 120 Senior Executive Trainee (SET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం విభాగంలో 95 పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థలో ఉద్యోగం కోరుకునే ఇంజినీరింగ్ మరియు ఫైనాన్స్ అభ్యర్థుల కోసం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. టెలికాం స్ట్రీమ్ పోస్టులకు BE/BTech (Electronics & Telecommunication, Electronics, Computer Science, IT, Electrical, Instrumentation)లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత అవసరం. ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టులకు CA లేదా CMA అర్హత ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్తివంచేవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1250 నిర్ణయించారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సవరణ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పరీక్ష తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం రూ. 45,400 ఉండే అవకాశం ఉంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా పోస్టింగ్ అవకాశం ఉండటంతో ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version