cool the wife : భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. మీరిద్దరు కలిసి జీవితాంతం ఉండాలి. అందుకే ఒకరికొకరు సాయం చేసుకోవడం, మద్దతు ఇచ్చుకోవడం అవసరం. మీ రిలేషన్ లో ప్రేమ, కోపం, బాధ్యతలు నిండాలి. భార్యభర్తల బంధంలో గొడవలు, అలకలు కామన్ గా కనిపిస్తుంటాయి. ఎన్నో వివాదాలు ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం కచ్చితంగా అలాగే నిత్యం నిలిచి ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే మీరు భార్యభర్తలు కాబట్టి. ఒక్కోసారి భర్తతో గొడవ పడితే భార్య అలుగుతుంది. ఈ అలక పాన్పు ఎక్కితే మాత్రం ఎంత బతిమాలినా, ప్రయత్నించినా ఆ అలకల మీది నుంచి దిగదు కద. ఇలాంటి సమయంలో భర్తలకు ఏం చేయాలో అర్తం కాదు. కానీ అలక తీర్చాల్సిన అవసరం మీదే. వారిని హ్యాపీ చేయడం వల్ల ఇల్లు, ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా సంతోషపడతారు. మరి భార్యల అలకలను ఎలా తీర్చాలో తెలుసా? అయితే ఇది చదివేసేయండి.
ఓ చిన్న స్పర్శ చాలు మీ మధ్య ఉన్న అలక, కోపం వెంటనే అటక ఎక్కుతుంది. ఆ స్పర్శ కూడా చాలా మృదువుగా, ప్రేమగా అనిపించాలి. అప్పుడు అలక, కోపం పోతుంది అంటున్నారు నిపుణులు. మీ భార్య కోపంగా ఉన్నా అలిగినా మాటి మాటికి టచ్ చేస్తూ ఉండండి. ఐస్ లా కరిగిపోతుంది. కుదిరితే ఎవరు లేని సమయం చూసి నుదుటి మీద ఓ ముద్దు పెట్టేయండి. మామూలు ముద్దుకాకుండా ఓ కౌగిలింత ఆ తర్వాత ముద్దు పెట్టండి. తను వెన్నలా కరిగిపోవడం పక్కా అంటున్నారు నిపుణులు.
తను అలిగినా, కోపం పెరుగుతున్నా జర మీ స్వరం తగ్గిందంటే చాలు తను కూడా ఆటొమెటిక్ గా కూల్ అవుతుంది. మీ అర్ధాంగితో ఎంత తగ్గి మాట్లాడితే అంత ప్లస్ పాయింట్. ఆమె చెప్పిన దానికి ఓకే చెప్పండి చాలు. ఇలా చేసిన మరుక్షణం భగభగ మండిన మీ భార్యామణి కూల్ అవుతుంది. అలిగిందని మరింత వాదన మాత్రం వద్దు. ఇలా చేయడం వల్ల భార్య కోపం మరింత పెరిగుతుంది.
భార్యనే కదా.. తప్పు ఉన్నా లేకున్నా ఓ సారీ చెప్పండి పోయేదేముందు బాస్. ఐస్ అయితే లైఫ్ సేఫ్ కదా. మీరు ఆ టైంలో క్షమాపణలు అడగడం వల్ల కూల్ అయిపోతుంది. దీని వల్ల ఆమె తప్పు లేదని అనుకుంటుంది. లేదంటే ఆమె తప్పు ఉన్న మీరు సారీ చెప్పారని మరింత త్వరగా కూల్ అవుతుంది. భార్యలండీ బాస్ భరించేయండి.
అలకల మీద ఉన్న భార్య వంట గదికి వెళ్లదు. మీరు వెళ్లి ఓ కాఫీ ఇచ్చి కూల్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన వంట చేయమనండి. వెంటనే ఇష్టంగా వంటి పెడుతుంది. అర్థం చేసుకోండి బ్రో. నేనేంటి వంట గదికి వెళ్లడం ఏంటి అని ఇగోకు వెళ్లకండి.
ఆడవారికి షాపింగ్ చాలా ఇష్టం. భార్య అలిగితే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం బెటర్. ఆమెను కూల్ చేయడానికి షాపింగ్‌కి తీసుకువెళ్తే పర్సు ఖాళీ అవుతుంది అనిపిస్తే జస్ట్ అలా బయటకు తీసుకొని వెళ్లండి. భార్యకు ఇష్టమైన చీర లేదా ఏదైనా వస్తువు కొనివ్వండి. దీంతో.. ఆమె కోపం పూర్తిగా పోతుంది.