https://oktelugu.com/

Body Lotion: సహజంగా ఇంట్లోనే లోషన్ తయారు చేసుకోవడం ఎలాగో మీకు తెలుసా?

ఇంట్లోనే లోషన్‌ను తయారు చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇంట్లోనే సహజంగా లోషన్ తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2024 / 03:54 AM IST

    Homemade Body lotion

    Follow us on

    Body Lotion: అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే అందం విషయంలో అమ్మాయిలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా చలికాలంలో చర్మం బాగా దెబ్బతింటుంది. ఎక్కువుగా నల్లగా కావడం, చర్మంపై తెల్లగా రావడం వంటివి జరుగుతుంది. దీనివల్ల ఎంత అందంగా ఉన్నా కూడా కనిపించరు. అయితే చలి కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ కూడా బాడీ లోషన్ వాడుతుంటారు. మార్కెట్లో దొరికే బాడీ లోషన్ వాడటం వల్ల కొన్ని సార్లు చర్మ సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తారు. వీటివల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే ఇంట్లోనే ఈ లోషన్‌ను తయారు చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇంట్లోనే సహజంగా లోషన్ తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    ఇంట్లోనే సహజంగా బాడీ లోషన్ తయారు చేయాలంటే కలబంద, విటమిన్ ఈ కాప్సూల్స్, గ్లిజరిన్, ఎసెన్షియల్ ఉండాలి. వీటితో ఈజీగా బాడీ లోషన్‌ను తయారు చేయవచ్చు. ఇంట్లో తయారు చేసిన బాడీ లోషన్ అయితే చర్మానికి ఎలాంటి ప్రమాదాలు దరిచేరవు. స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిన్నింటిని ఒక పాత్రలో వేసి జెల్‌లా అయ్యే వరకు కలపాలి. వీటిని ఎంత బాగా కలిపితే అంత మంచిగా బాడీ లోషన్ తయారవుతుంది. ఈ లోషన్ తయారు కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ చర్మ ఆరోగ్యానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి, మొటిమలు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వాడే రోజ్ వాటర్, విటమిన్ ఈ కాప్సూల్స్, గ్లిజరిన్ చర్మ సమస్యలను క్లియర్ చేయడంలో బాగా సహాయపడుతుంది. డైలీ ఈ లోషన్‌ను వాడటం వల్ల చర్మం నిగారింపుగా ఉంటుంది. వీటిన్నింటిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించి యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తుంది. మార్కెట్లో దొరికే క్రీముల కంటే ఇంట్లో తయారు చేసిన బాడీ లోషన్ చర్మానికి అప్లై చేయడం మంచిది. దీనివల్ల చర్మ సమస్యల నుంచి బయటపడతారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.