Air Pollution: ప్రస్తుతం ఉండే జీవనశైలి పూర్తిగా మారిపోయింది. మనుషులు జీవనశైలిలో మార్పలు రావడంతో పాటు వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఈ వాతావరణంలోని మార్పుల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మనుషులు చేసే పనుల వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎక్కువగా ప్లాస్టిక్ వాడటం, వ్యర్థాలు, హానికర రసాయనాల వల్ల వాతావరణం మొత్తం కాలుష్యం అవుతుంది. ముఖ్యంగా వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్య నాణ్యత తగ్గిపోతుంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, మాస్క్ పెట్టుకోవడం వంటి రూల్స్ తెచ్చారు. పగటి సమయంలో అసలు దారి కూడా కనిపించడం లేదు. వాతావరణంలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో చాలా మంది చిన్న వయస్సు నుంచే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడి దీర్ఘకాలికంగా సమస్యల బారిన పడుతున్నారు. అయితే వాయు కాలుష్యం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.
వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. కాలుష్యాన్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఊపిరితితత్తులు తొందరగా దెబ్బతింటాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ వాయు కాలుష్యం వల్ల చిన్న వయస్సు నుంచే గుండె పోటు ప్రమాదాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనాల నుంచి వచ్చే గాలి శరీరంలోని ఊపిరితిత్తులకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రక్తప్రవాహంలోకి ప్రవేశించి, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వాయు కాలుష్యం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. రక్తనాళాల్లో నానోపార్టికల్స్ పేరుకుపోయి మరింత తీవ్రమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా 6 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల రక్తపోటు కూడా అధికం అవుతుందట. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యం ఉంటే ఎక్కువగా బయటకు వెళ్లవద్దు. అవసరమైన సమయాల్లోనే వెళ్లడం మంచిది. అలాగే ఇంట్లో చెట్లు నాటడం, బయట కూడా నాటడం వంటివి చేయాలి. వ్యాయామం చేయడం వంటివి కూడా చేయాలి. బయటకు ఎక్కడికి వెళ్లిన కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. వాయు కాలుష్యం వల్ల కేవలం శారీరక సమస్యలతోనే కాకుండా మానసిక సమస్యలతో కూడా ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలుష్యం నుంచి బయటపడటానికి పోషకాలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొంత వరకు వచ్చే సమస్యను తగ్గించవచ్చు. ప్రతీ ఒక్కరూ కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా పోరాడాలి. చెట్లు నాటడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలి. ముఖ్యంగా వాహనాల వల్ల కూడా ఎక్కువగా కాలుష్యం అవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కో ఇంట్లో ఒక్కోరికి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉంటున్నాయి. వీటివల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతుందని అంటున్నారు. దేశంలో ఎక్కువగా ఢిల్లీలోనే గాలి కాలుష్యం అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.