Stop Non-Veg For A Month: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం అవసరం. ప్రోటీన్లు, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవడం వలన ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా మాంసకృతుల్లో లభిస్తాయి. దీంతో చాలామంది వీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చికెన్, మటన్ లాంటివి రుచికరంగా ఉండడంతో పాటు ఇందులో ప్రొటీన్లు ఉండడం వలన వీటికి సంబంధించిన పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే మాంసకృతుల వలన శరీరానికి శక్తి రావచ్చు.. కానీ అదే పనిగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి ఆ తర్వాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. నెల రోజులపాటు నాన్ వెజ్ మానివేయడం వల్ల వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా నెల రోజులు మాంసకృతులకు దూరంగా ఉంటే ఈ ఐదు మార్పులు కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు. ఐదు మార్పు లేవో ఇప్పుడు చూద్దాం..
మాంసకృతుల్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మటన్ లో కొవ్వు అధికంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన శరీరంలో అధికంగా కొవ్వు పేరుకు పోతుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నెల రోజులపాటు మటన్ లేదా చికెన్ కు దూరంగా ఉండటం వలన గుండె పనితీరు మెరుగు పడుతుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య బరువు. నాన్ వెజ్ ఎక్కువగా తినే వారు బరువు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు మాంసకృతులకు దూరంగా ఉండటమే మంచిది. అధిక బరువు వలన అనేక కొత్త రోగాలు వస్తాయి. అయితే ప్రోటీన్లు ఉండే కూరగాయలను తీసుకోవడం వలన బరువు పెరగకుండా శక్తి వస్తుంది. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.
మలబద్ధకం సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎక్కువగా నాన్ వెజ్ తినే వారిలో ఇది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. మొదట్లో జీర్ణ సమస్యగా ఉండి ఆ తర్వాత మలబద్ధకం సమస్యగా మారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వలన పేగుల్లో కొవ్వు పేరుకుపోయి కడుపు ఉబ్బరంగా మారుతుంది. అందువల్ల తక్కువ కొవ్వు ఉండే కూరగాయలను తీసుకోవడం మంచిది.
శరీరంలో కొలెస్ట్రాల్ మోతాదులో ఉండడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ మాంసకృతులు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వలన అనేక వ్యాధులు ఏర్పడతాయి. అందువల్ల నాన్ వెజ్ కు దూరంగా ఉండి కూరగాయలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య లేకుండా ఉండొచ్చు.
మాంసంస్కృతిలో కంటే కొన్ని కూరగాయలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాక ఇవి ఫైబర్ తో కలిగే ఉంటాయి. దీంతో ఎలాంటి కొవ్వు లేకుండా శరీరానికి అదనపు శక్తినిస్తాయి. అందువల్ల మాంసకృతులకు చాలా వరకు దూరంగా ఉండి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.