Black Thread : ఈ రాశుల వారు నల్లదారం కట్టుకుంటే ఏమవుతుంది?

సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి చేతికి కొన్ని దారాలు కట్టుకుంటారు. వీటిలో నల్లదారం ఎక్కువ మంది ధరిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : January 29, 2024 12:02 pm

black thread on leg

Follow us on

Black Thread : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు. దీంతో సొంత ఆలోచనతో కొందరు రకరకాల పనులు చేస్తారు. అయితే ఇవి రివర్స్ గా మారి మంచికి బదులు దుష్ఫరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో పోల్చుకొని ఈ పనులు చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి చేతికి కొన్ని దారాలు కట్టుకుంటారు. వీటిలో నల్లదారం ఎక్కువ మంది ధరిస్తారు. నల్లదారం చేతికి కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే ఈ రెండు రాశుల వారు నల్లదారాన్ని ధరిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరగుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

నలుపు శనీశ్వరుడికి చాలా ఇష్టం. అయితే కొందరు శని ప్రభావం ఉండకుండా నల్లదారం ధరిస్తారని అంటారు. అలాగే దిష్టి తగలకుండా ఉండడానికి నల్లదారం ధరిస్తారు. మగవాళ్లు నల్లదారాన్ని చేతికి కట్టుకుంటారు. ఆడవాళ్లు ఎడమ కాలుకు కట్టుకుంటున్నారు. ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది వీటిని అందంగా ఉండేందుకు కూడా ధరిస్తున్నారు. కానీ నల్లదారాన్ని అందరూ కట్టుకోవడం మంచిది కాదు. కొందరు మాత్రమే దీనిని ధరించాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి ఉన్న వారికి బృహస్పతి ఆధిపత్యంగా ఉంటాడు. బృహస్పతికి ఎరుపు అంటే ఇష్టం. వృశ్చిక రాశి ఉన్న వారు నల్లదారం కట్టుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మగవాళ్లు వీలైతే ఎరుపు దారం కట్టుకోవచ్చు. కానీ ఆడవాళ్లు కాలుకు మాత్రం నల్లదారం కట్టుకోకూడదని కొందరు పండితులు చెబుతున్నారు. అలాదే మేషం రాశివారికి కూడా గురుడు ఆధిపత్యంగా ఉంటాటరు. ఈ రాశివారు సైతం నల్లదారాన్ని ధరించకూడదు. వీరు నల్లదారాన్ని ధరిస్తే అన్నీ కష్టాలే ఎదురవుతాయని అంటున్నారు.

పై రెండు రాశుల వారు కాకుండా మిగతా వారు నల్లదారాన్ని ధరించవచ్చు. అయితే కొత్తగా నల్లదారాన్ని శనివారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. నరదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. నల్లదారాన్ని కట్టుకున్న వాళ్లు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రోజులకొకసారి మారుస్తూ ఉంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.