Betel Leaf: తమలపాకే కదా అని పారేస్తున్నారా? తెలిస్తే వదలరు..

3-4 తమలపాకును నీటిలో కడిగి మూడు గ్లాసుల నీటిలో మరిగించాలి. నీరంతా మరిగి ఒక గ్లాస్ నీరు అయినప్పుడు చల్లార్చి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : March 23, 2024 11:20 am

Betel Leaf

Follow us on

Betel Leaf: తమలపాకును ఈ రోజుల్లో చాలా మంది వాడుతున్నారు. పూజలు చేస్తున్న చాలా మంది తాంబూలం ఇస్తే కచ్చితంగా తమలపాకు ఉంటుంది. కానీ ఈ తమలపాకును పారేసే వారే ఎక్కువ. మరో ముఖ్య విషయం ఏంటంటే.. భోజనం చేసిన తర్వాత పాన్ తినడానికి ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. తమలపాకు నీల్లు చాలా మంచివి అని చెబుతున్నారు నిపుణులు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. తమలపాకు నీరు జలుబు, దగ్గుకు మేలు చేస్తుంది. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఇంతకీ అవేంటంటే..

3-4 తమలపాకును నీటిలో కడిగి మూడు గ్లాసుల నీటిలో మరిగించాలి. నీరంతా మరిగి ఒక గ్లాస్ నీరు అయినప్పుడు చల్లార్చి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతాయి. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ సమస్య ఉన్నవారికి కూడా తమలపాకు వాటర్ మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న తమలపాకు నీరు దగ్గు, పిత్త దోషాలను నయం చేయడంలో మంచి ఔషధం. గొంతు వాపును, ఛాతీలో పేర్కొని పోయిన కఫాన్ని తొలగిస్తుంది. వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు ఉంటే కూడా తమలపాకు నీరు చాలా ఉపయోగపడుతాయి.

తమలపాకు నీరు జీర్ణ శక్తిని సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ నీటి వల్ల జీర్ణ శక్తి ఆరోగ్యంగా ఉంటుంది.తమలపాకు వాటర్ తో చెడు వాసన కూడా దూరం అవుతుంది. దీనితోపాటు దంతాలను కూడా శుభ్రపరుస్తుంది. మరి తెలుసుకున్నారు కదా తమలపాకు నీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇంకెందుకు ఆలస్యం ఈ సారి ఓసారి ట్రై చేయండి. కానీ జాగ్రత్త సుమ. కొత్తగా ఏది ట్రై చేసినా కాస్త క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే.