Lord Shiva: మనకున్న తెలుగు వారాల్లోని ఒక్కో రోజు ఒక్కో దేవుడనికి ప్రీతికరమైనది. ఆ రోజు ఆ దేవుడుని పూజిస్తే అధిక పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు పండితులు. అయితే సోమవారం మూల దేవుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పరమశివుడిని పూజిస్తే మటుకు కచ్చితంగా మంచి జరుగుగుతుందని నానుడి.
మరి ఈ సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలి, ఎలా శని ప్రభావాన్ని తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయడం చాలామంచిది. దాని వల్ల సర్వ బాధలు తొలగిపోయి, దీర్ఘ కాలిక వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఇలా సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలను తప్పించుకోవడానికి పరమశివుడికి ఇలా అభిషేకం చేయాల్సి ఉంటుంది.
Also Read: వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!
ఇక సోమవారం తెల్లవారు జామున ఓం నమః శివాయ అనే పంచాక్షరిని జపిస్తే సర్వ కష్టాలు అంతరించిపోతాయి. కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న బాధలు అన్నీ కూడా పోతాయి. అలాగే నీటితో, వివిధ రకాల వస్తువులతో శివలింగాన్ని అభిషేకిస్తే చాలా మంచి జరుగుతుంది. వాటి పుణ్య ఫలం కచ్చితంగా భవిష్యత్‌లో మీకు కనిపిస్తుంది.
వీటన్నింటితో పాటు సోమవారం ధ్యానం చేయడం చాలా ముఖ్యం. శివను పేరును ధ్యానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ మీ జీవితంలో కాలసర్ప దోషం లాటివి ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఇక పంచాక్షరిని జపిస్తే శత్రువుల నుంచి ఎలాంటి ప్రమాదాలు ఉన్నా సరే తప్పించుకోగలుగుతారు. అయితే ఈ ధ్యానాన్ని మాత్రం రుద్రాక్ష జపమాలను ధరించి మాత్రమే చేయాలి.
Also Read: ఈ అయిదు రాశులవారు రిలేషన్షిప్ కి కట్టుబడి ఉండలేరట! ఆ రాశి వారితో జాగ్రత్త !