https://oktelugu.com/

RRR Record Breaking: మరో సరికొత్త రికార్డు నమోదు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ !

RRR Record Breaking: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తుంది. అయితే.. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ చిత్రం కేవలం రెండు వారాల సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. పైగా ప్రపంచవ్యాప్తంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2022 / 10:55 AM IST
    Follow us on

    RRR Record Breaking: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తుంది. అయితే.. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ చిత్రం కేవలం రెండు వారాల సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది.

    RRR Record Breaking

    పైగా ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి భారతీయ సినిమా ‘దంగల్‌, మూడో సినిమా ‘బాహుబలి 2’. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా చేరింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘‘ఒక భారతీయ చిత్రం 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఒక డ్రీమ్. మిమ్మల్ని అలరించేందుకు మా వంతు ప్రయత్నం చేశాము. కానీ, మీరు మా పై వెలకట్టలేని ప్రేమను చూపించారు.

    Also Read: RRR 14 Days Collections: వేయి కోట్లుకు ఎంత దూరంలో ఉందంటే ?

    మా భీమ్ ‘ఎన్టీఆర్ అభిమానుల’కు, రామరాజు ‘చరణ్ అభిమానుల’కు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు.. అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలుపుతూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ చిత్రానికి రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి . ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గానూ గ్రాస్ పరంగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, కేజీఎఫ్ 2 దెబ్బకు ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడబోతోంది. ఇప్పటికే `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు తన పేరిట సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో టిక్కెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. దీనిబట్టి ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ఇంకా భారీగా పడే అవకాశం ఉంది.

    Also Read: RRR Movie Success Meet: రాజమౌళి అగ్రిమెంట్ ను బ్రేక్ చేసిన అమీర్ ఖాన్

    Tags