Benefits Of Relationships: అందమైన జీవితం గడపాలని అందరికీ ఉంటుంది. కానీ సంతోషకరమైన జీవితం అంటే ఎలా ఉంటుంది? అందుకోసం ఏం చేయాలి? అని సందేహం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకుంటారు. మరికొందరు ఉమ్మడి కుటుంబంలో ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదన.. ఇతర కారణాలవల్ల ఉమ్మడి కుటుంబం విచిన్నమవుతుంది. దీంతో చాలామంది ఎవరికి వారే అన్నట్లుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో బంధుత్వం తగ్గిపోతుంది. అయితే బంధుత్వం అనేది పెంచుకుంటేనే పెరుగుతుంది.. అవసరం లేదనుకుంటే అక్కడితోనే ఆగిపోతుంది. మరి బంధుత్వం కావాలంటే ఏం చేయాలి?
సమాజంలో మంచి గుర్తింపు ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలని కొందరు చెబుతూ ఉంటారు. అంటే ఎదుటివారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారికి గౌరవం ఇస్తూ.. అవసరమైనప్పుడు వారికి సాయం చేస్తూ ఉండడం వల్ల కొత్త వ్యక్తులు బంధువులుగా మారిపోతారు. మరోవైపు అమ్మా నాన్నల తరఫున నుంచి బంధువులుగా ఉండిపోతారు. ఇలా అందరినీ కలుపుకుపోవడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది. అది ఎలా అంటే? ఒక్కోసారి ఆర్థిక అవసరాలు రావచ్చు.. మరి కొన్నిసార్లు ఆపదల రావచ్చు.. ఇలాంటి సమయంలో తెలియని వారి కంటే బంధువులే ముందుగా స్పందిస్తారు. ఒకరికొకరు సాయం చేస్తూ వారిని ఆదుకోవాలని చూస్తారు. ఎందుకు కారణం బంధుత్వం కలిగి ఉండడమే.
బంధుత్వం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఏదైనా కార్యక్రమం నిర్వహించేటప్పుడు బంధువులు ఇంటికి రావడం వల్ల ఎంతో సందడిగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆచార సంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. అనుభవం ఉన్నవారు జీవితానికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఉంటారు.పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు ఒకరి ఇళ్లల్లోకి మరొకరు వెళ్లినప్పుడు.. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏడాదికోసారి బంధువుల ఇళ్లకు వెళ్లి రావడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అంతేకాకుండా పెళ్లి సంబంధాల్లోనూ.. విద్య, ఇతర అవసరాల్లో బంధువుల సాయం ఎక్కువగా ఉంటుంది. డబ్బు అవసరమైనప్పుడు కొందరు బంధువులే ముందుగా స్పందించి సాయం చేసే అవకాశం ఉంది.
Also Read: Relationship: చాణక్య నీతి: మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే ఏం చేయాలో తెలుసా?
కానీ నేటి కాలంలో ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా జీవించాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది. బంధుత్వం లేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల సహాయం తీసుకునే అవకాశం ఉండదు. బంధువులు ఉన్నట్లయితే వారు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే బంధువులు సాయం చేస్తుంటారు. తెలియని వ్యక్తుల కంటే తెలిసిన వ్యక్తులే సాయం చేయడానికి ఆరాటపడతారు.
అయితే పాత బంధువులు.. కొత్త బంధువులు అని కాకుండా.. ఉన్నవారిని తొలగించుకోకుండా కొత్తవారిని కలుపుకుపోవడం వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుంది. సమాజంలో ఎంత మంది బంధువులు ఉంటే అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా బంధువుల్లో కూడా కొందరు మంచివారు లేకపోవచ్చు. అయితే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. బంధుత్వం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వారికి ఏదో రకంగా ప్రయోజనాలు కలుగుతాయి.