Benefits of having a dog: కుక్కలను చూస్తే మీరు ఏం అనుకుంటారు. ఒకప్పుడు ఈక్వేషన్ వేరు. ఇప్పుడు ఈక్వేషన్ వేరు కదా. నీది కుక్క బతుకేరా అని తిట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం కుక్కలా బతికితే బాగుండు రా బై అనుకుంటున్నారు. మరి ఉండదా? కుక్క కనిపించకపోతే కేసు, కుక్క కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు, కుక్కకు ఖరీదైన బట్టలు, దాని గొలుసుకే వేలల్లో ఖర్చు. కానీ మన చేతికి చిన్న రింగ్ ఉండదు. ఇవన్నీ చూస్తే పేదోని బతుకు కంటే ఉన్నోడి దగ్గరి కుక్క జీవితం నయం అని అనుకునే వారు చాలా మందే ఉన్నారు. కొందరికి ఇది జీర్ణం అవడం కష్టమే కానీ నిజమేనండోయ్.
Also Read: పెళ్లిలో అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఇక ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ మొదలైంది పండగ చేసుకోండి
సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఆ కుక్కతోని నడిస్తే… అయ్యో రామ. పదే పదే కుక్క అంటే ఈ పెట్ లవర్స్ తెగ సీరియస్ అవుతారండోయ్. సో పెంపుడు డాగ్స్ అందామా? వీటితో బయటకు వాకింగ్ కు వెళ్లేవారికి ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి అంటోంది ఓ పరిశోధన. నిజమే. మీరు విన్నది. అరె ఏంటి ఈ కుక్కగోల అని తెగ పరేషాన్ అవకండీ. అయితే మీలో చాలా మంది వాకింగ్ కు వెళ్తుంటారు కదా. వాకింగ్ కు వెళ్లే వారు మార్నింగ్ లేదా ఈవినింగ్ వాక్ కు వెళ్తుంటారు.
కానీ పెంపుడు కుక్కలు ఉన్నవాళ్లు వారి కోసం కాకపోయినా ఆ కుక్క ల కోసం అయినా సరే ప్రతి సారి వాకింగ్ అలా బయటకు వెళ్తారు. బట్ అది ఎంత స్పీడ్ గా వెళ్తే అంతే స్పీడ్ గా వెళ్తారు కదా. ఇదిగో ఇక్కడే వారికి ప్రయోజనాలు చేకూరుతాయట. ఇలా పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరుల కంటే రోజుకు కనీసం 22 ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్ పూర్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. అది ఒక రోజు. అదే సంవత్సరం మొత్తం పరిశీలిస్తే మిలియన్ కంటే ఎక్కువ అడుగులు వేస్తారట.
Also Read: పిల్లలు డే అంత పడుకొని రాత్రంతా ఎందుకు మేల్కుంటారు అసలు?
యజమానులు కుక్క వేగానికి తగ్గట్టు నడిస్తే కొలెస్ట్రాల్, హైబీపీ, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయట. ఇవన్నీ సమస్యలు రాకపోతే జీవితం కాలం పెరుగుతుంది కదా. మరి మీకు ఇంట్లో కుక్క ఉందా? లేకపోతే తెచ్చేసుకోండి. అయ్యో మరో ముఖ్యమైన విషయమండోయ్. దానికి ఫుల్ గా ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. కొన్నింటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే మీ ఇష్టం. మీ బడ్జెట్, మీ ఓపికను బట్టి థింక్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి మై డియర్ రీడర్స్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.