Soaked Peanuts Benefits: వేరుశనగను పేదవాడి జీడిపప్పుగా పిలుస్తారు. ఇందులో ఉండే ప్రొటీన్లతో ఎంతో లాభం కలుగుతుంది. మన శరీరానికి పోషక విలువలు అందించడంలో వేరుశనగ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేరుశనగను ఉడకబెట్టి, నానబెట్టి, వేయించుకు తిన్నా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలతో మన దేహానికి బలం చేకూరుతుంది. అది ఎంత బలం అంటే కిలో మాంసం తిన్నా, పది కోళ్లు తిన్నా రాని శక్తి వేరుశనగలు తింటే వస్తుందని ఎంత మందికి తెలుసు. అయినా మాంసారానికి మొగ్గు చూపుతున్నారు. కిలో మాంసం ధర సుమారు రూ.800గా ఉంది. దీంతో మనం మాంసాహారానికి పెట్టే డబ్బులతో ఎన్నో రెట్ల వేరుశనగలు తీసుకోవచ్చు. వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఈ విషయాలు పట్టించుకోరు.

వేరుశనగలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం, సెలీనియం, జింకు, కాల్షియం వంటి లవణాలు ఉండటంతో వీటిని తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఆరోగ్య పరిరక్షణలో వేరుశనగ పాత్ర కీలకంగా మారింది. ప్రతి రోజు నానబెట్టిన వేరుశనగలు తీసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యకరంగా ఉండేందుకు మేలు చేసే ఖనిజాలు దాగి ఉన్నాయి. దీంతో వేరుశనగ మన దేహానికి ఎంతో అవసరం. వంద గ్రాముల వేరుశనగ తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు లభిస్తాయని మెడికల్ న్యూస్ టుడే ఓ కథనంలో వెల్లడించింది. దీంతో వేరుశనగ తినడం మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి కలుగుతుంది.
నానబెట్టిన వేరుశనగలో తడి తొక్క రక్తప్రసరణను అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన వేరుశనగలతో కండరాల క్షీణత తగ్గుతుంది. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. గ్యాస్ సమస్యలు రాకుండా చేస్తాయి. వెన్నునొప్పి, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో కీళ్లలో దృఢత్వం పెరిగేలా చేస్తుంది. బెల్లంతో కలిపి తీసుకుంటే మేధస్సు పెరుగుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. వేరుశనగలో ఉన్న పోషకాలతో మనకు ఎన్నో లాభాలు చేకూరుతాయి.

వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, కాల్షియం, ఐరన్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేకూరుస్తాయి. నానబెట్టిన వేరుశనగలను తీసుకోవడం ద్వారా చర్మానికి అందమైన మెరుపు వస్తుంది. నానబెట్టిన వేరుశనగల వల్ల మన శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన వేరుశనగలను ఉదయం తింటే ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. ప్రతి రోజు గుప్పెడు వేరుశనగలను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్ గా తీసుకున్నా మరిన్ని లాభాలు దక్కుతాయి.