Benefits of Left Hand: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అంటారు పెద్దలు. ఒక్కోసారి మన చేసే పనులు అటూ ఇటూ అయ్యే సందర్భంలో దీనిని వాడినా.. ఒక్కోసారి కుడి చేతి వాటంకు బదులు ఎడమ చేతి వాటం ఉండేవారితో ఇబ్బంది లేదనే అర్థం వస్తుంది. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరికి ఎడమచేతి వాటం ఉంటుందని గుర్తించారు. వీరికి ఇలా రావడానికి జన్యువులే కారణం అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వారు గుర్తించారు. మానవ మెదడులో సైటో స్కెల్టన్ అనే పదార్థం ఆ మనిషి ఏ చేతి వాటమో నిర్ణయిస్తుంది. అయితే ఎడమచేతి వాటం ఉన్న వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే?
Also Read: ఇతనికి 200 పాము కాట్లు పడినా ఏం కాలేదు ఎందుకో తెలుసా?
ప్రతి ఒక్కరూ ఏ పని అయినా కుడి చేతితోనే ఎక్కువగా చేస్తారు. ఎడమ చేతితో కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతారు. అయితే కుడి చేతి వాటం కంటే ఎడమ చేతి వాటం ఉన్న వారు ఎక్కువగా చురుగ్గా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. వీరు ఒకేసారి ఎక్కువ పనులు చేయగలుగుతారు. వీరిలో క్రియేటివిటీ మైండ్ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఆటల్లో వీరు ప్రావీణ్యం సంపాదిస్తారు. మిగతా వారి కంటే వీరి మెమొరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి.
అయితే ఎడమ చేతి వాటం వారిలో కొన్ని సమస్యలు లేకపోలేదు. వీరిలో షిజోఫెర్నియాల అనే వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. కొన్ని సంస్కృతుల్లో ఎడమచేతి వాటం ఉన్న వారిని దురదృష్టవంతులుగా భావిస్తారు. ప్రెంచ్ లో ఉన్న పదాల్లో ఎడమ చేతి(Gauche) కి అయోమయం అనే అర్థం వస్తుంది. .. కుడిచేతి రైట్ అనే అర్థం అంటే సరైనది అని అంటారు. కొందరు ఎడమ చేతి వాటం కలిగిన వారిలో మెదడు త్వరగా వృద్ధి చెందే అవకాశం తక్కువ అని అంటున్నారు.
Also Read: తొలి శుభలేఖ మొదట ఆ దేవుడికి ఇవ్వాలి.. ఎందుకంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఎడమ చేతి వాటం కలిగిన వారు ఎందరో ప్రముఖులు ఉన్నారు. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుుష్, బరాక్ ఒబామా ఉండగా.. ఇండియాలో రతన్ టాటా, అభిషేక్ బచ్చన్, సావిత్రి, మమ్ముట్టి, సూర్యకాంతం ఉన్నారు. అలాగే క్రెటర్లలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, శిఖర్ దావన్ ఉన్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారు కొన్ని సమస్యలు ఉన్నా..మొత్తంగా వీరిలో ఆలోచన శక్తి ఉంటుందని అంటున్నారు. అలాగే వీరు ఏ పని అయినా తొందరగా పూర్తి చేయాలని అనుకుంటారు. కవలల్లో ఒకరిది కుడి చేతి వాటం అయితే ఒకరిది ఎడమ చేతి వాటం వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్య ప్రముఖులు తెలుపుతున్నారు.