Slim does not mean Fit: నడుము సైజు పెరగకూడదు. వయసు పెరుగుతున్నా చర్మం నిగనిగలాడాలి. ఎక్కువ తినకూడదు. ప్రతిదీ లెక్కలు వేసుకుని తినాలి. అన్నింటిని తూకం వేసి లాగించాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. లావు అవ్వాలని.. బొజ్జ గణపయ్య లాగా ముద్దుగా ఉండాలని నేటి కాలంలో ఎవరు కోరుకోవడం లేదు. స్థూలంగా చెప్పాలంటే సైజులు మైంటైన్ చేస్తున్నారు.. ఒకప్పుడు నగరాలలో మాత్రమే ఈ కల్చర్ ఉండేది. ఇప్పుడు మారుమూల పట్టణాలు.. గ్రామాలలో కూడా ఈ కల్చర్ కనిపిస్తోంది.
యువకులు కండలు పెంచి.. వస్తాద్ లాగా కనిపించాలని కోరుకుంటుంటే.. అమ్మాయిలు మాత్రం సన్నజాజి తీగలాగా ఉండాలని భావిస్తున్నారు. శరీర ఆకృతి అనేది అన్న నచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఫిట్ అంటే హెల్తీగా ఉన్నట్టేనా.. శరీరంలో సైజులు పెరగకుండా.. స్థిరంగా ఉంటే ఆరోగ్యం గొప్పగా ఉన్నట్టేనా.. ఈ ప్రశ్నలకు లభించిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. అది కాస్త అనేక రకాల చర్చలకు దారితీస్తోంది.
చాలామంది ఫిట్ గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తుంటారు. కానీ అవి రెండు వేరు. ఎందుకంటే ఆరోగ్యమనేది మన శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సరైన నిద్ర.. బ్యాలెన్స్డ్ ఫుడ్.. తక్కువ ఒత్తిడి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు.. ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి రోగాలు దరి చేరవు. పైగా హార్మోన్లు సక్రమంగా విడుదలవుతాయి. ఇతర ఎంజైములు సక్రమంగా పనిచేస్తాయి.. అందువల్ల దేహం అద్భుతంగా ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
కొంతమంది బరువులెత్తుతుంటారు. వేగంగా పరుగులు పెడుతుంటారు. కండలు పెంచుతుంటారు. జంక్ ఫుడ్ అసలు ముట్టరు. తిండి విషయంలో లెక్కలు వేసుకుంటారు. అలాంటివారు చూసేందుకు ఫిట్ గా ఉంటారు. అలాగని వారి ఆరోగ్యం సక్రమంగా ఉన్నట్టు కాదు. ఉదాహరణకు సినీనటి సమంత ఫిట్ గా ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో ఎలాగైతే ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. అలాగని ఆమె హెల్దిగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఆమెకు ఆ మధ్య కండరాల వ్యాధికి చికిత్స పొందుతున్న దృశ్యాలను కూడా ఆమె మీడియాలో రిలీస్ చేసింది. ఇప్పటికి కూడా ఆమె చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సమంత ఉదంతం కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా.. సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. సరైన నిద్రపోవాలి. ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. అప్పుడే దేహం బాగుంటుంది. దేహం బాగుంటే అన్ని బాగుంటాయి.