Before Talking: ఈ ప్రపంచంలో ఏదైనా పదునైన వస్తువు ఉందంటే అది మాటలు మాత్రమే. ఎందుకంటే మనిషి మాటలు చాలా విలువైనవి. ఇతరులతో మనం మాట్లాడే విధానం ఇద్దరి మనుషులను కలుపుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య గొడవలను కూడా పెంచుతుంది. అయితే కొందరికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. దీనివల్ల వారిని పెద్దగా ఎవరూ ఇష్టపెట్టుకోరు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత గురించి తెలిసిందే. ఏదైనా మనం మాట్లాడే తీరు బట్టే ఉంటుందని మన పెద్దలు కూడా చెబుతుంటారు. చిన్న పిల్లలకు అయితే తల్లిదండ్రులు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. లేకపోతే వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. ఏ విషయం గురించి అయిన మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటిని మైండ్‌లో పెట్టుకునే ఎవరితోనైనా మాట్లాడాలి. లేకపోతే సమస్యలు తప్పవు. మరి ఎవరితోనైనా మాట్లాడే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
సత్యం
కొందరు కొన్ని విషయాల్లో నిజమేంటో తెలియక నోటికి ఏం వస్తే అదే అనేస్తుంటారు. ఇతరుల విషయాల్లో కూడా నిజనిజాలు ఏంటో తెలియక మాట్లాడుతుంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏ విషయం గురించి అయిన మాట్లాడే ముందు ఇది నిజమా? లేకపోతే అబద్ధమా? అనే విషయం తెలుసుకున్న తర్వాతే మాట్లాడటం మంచిది. ముఖ్యంగా కొందరు అయితే గాసిప్స్ ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇలా సగం మ్యాటర్‌తో ఎదుటివారి నుంచి తప్పుగా మాట్లాడొద్దు. ఏ విషయాన్ని అయిన ఎవరితో చెప్పినట్లయితే తప్పకుండా అది నిజమో కాదో తెలుసుకున్న తర్వాతే మాట్లాడటం అలవాటు చేసుకోండి.
వినే ఇంట్రెస్ట్ ఉందా? లేదా?
కొందరికి చెప్పే ఇంట్రెస్ట్, ఓపిక ఉన్నా కూడా వినే ఓపిక ఉండదు. ఇది గమనించకుండా చెప్పాలని ఉందని కొందరు ఏదో ఒకటి ఇతరులతో మాట్లాడుతుంటారు. ఇలా చేయవద్దు. మీరు చెప్పే మాటలు అవతలి వారు వింటారా? లేదా? అనే విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు చెప్పడం మేలు. కొందరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీరి మాటలు విని కొందరు చిరాకు కూడా పడుతుంటారు. అయిన వారి అభిప్రాయాన్ని గౌరవించక మాట్లాడుతుంటారు. ఇలా చేయకూడదనే విషయం ముందుగా గుర్తుపెట్టుకోండి.
అత్యవసరం
ఏదైనా విషయం ఎవరికైనా తెలిస్తే ఈ విషయాన్ని ఎంత తొందరగా ఇతరులకు తెలియజేయాలని కొందరు చూస్తుంటారు. అసలు ఆ విషయం ఇతరులకు ముఖ్యమా.. కాదా అనే విషయం కూడా ఆలోచించరు. ఎప్పుడైనా ఏ విషయాన్ని అయిన చెప్పే ముందు అది అవతలి వ్యక్తులకు ఎంత ముఖ్యమూ అనే విషయం తెలుసుకున్న తర్వాతే చెప్పాలి. అందరికీ అన్ని విషయాలు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి తెలుసుకోకుండా ఏ విషయాన్ని కూడా చెప్పవద్దు. ఎవరితో ఎంత వరకు షేర్ చేయాలో అంత వరకు మాత్రమే షేర్ చేయాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.