Diwali lamps : దీపావళి రోజు దీపాలను వెలిగించే ముందు ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి. లేదంటే అరిష్టం.

మరికొన్ని రోజుల్లో దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి మొత్తం భారతదేశం ముస్తాబు అవుతుంది. ఆరోజున దేశం మొత్తం దీపాల వెలుగులో దేశం అందంగా కనిపిస్తుంది. జీవితంలో నెలకొన్న చీకట్లను ఈ దీపావళి దూరం చేస్తుంది అని నమ్ముతుంటారు భక్తులు. అలాంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్న శుభకార్యం నుంచి పెళ్లిళ్ల వరకు దీపంతోనే మొదలవుతాయి. అయితే దీపావళి రోజున పెట్టె దీపానికి ఇంకా అధిక ప్రాధాన్యత ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాంటి దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని చెబుతున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : October 26, 2024 3:59 pm

Before lighting the Diwali lamps, you must know these precautions. Otherwise it is inauspicious.

Follow us on

Diwali lamps : ఇలా వెలిగించాలి.. దీపం అనేది దేవతాస్వరూపం. ఈ దీపాన్ని దేవుడికి సమానంగా పూజిస్తుంటారు. అలాంటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదకు ముందుగా గంధం పెట్టాలి. అలాగే కుంకుమ, పూలు పెట్టి నమస్కరించుకోవాలి. అనంతరం అక్షింతలు సమర్పించి పూజించాలి. ఇలా చేయడం ద్వారా దేవుళ్ళ కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని నమ్మకం.

చాలా మంది తమకున్న డబ్బులను చూపించేందుకు, ఆయుధునికతకు అలవాటు పడడంతో వెండి, బంగారం వంటి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను ఎలాంటి ప్రమిదల్లో వెలిగించడం కంటే మట్టి ప్రమిదల్లో వెలిగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లోహం వేడి ఎక్కితే భూమి వేడెక్కుతుందని అది భూమాతను ఇబ్బంది పెడుతుందన్నారు. అందుకే మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని అవి వేడిని గ్రహిస్తాయని పేర్కొంటున్నారు.

చాలా మంది ఒకటే ఒత్తి పెట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపాలను వెలిగించడం శుభసూచకం కాదని చెబుతున్నారు. దీపాలను వెలిగిస్తున్నప్పుడు కచ్చితంగా  రెండు లేదా మూడు వత్తులు వేయాలి. అప్పుడే దీపం వెలిగించాలి.  అయితే దీపాలను ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడట. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తేనే ఆ దీపం పవిత్రత ఉంటుందని చెబుతున్నారు.

దేవతలకు అధిపతి  ఇంద్రుడు అని తెలిసిందే. అయితే  పోయిన తన ఐశ్వర్యం తిరిగి పొందాడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి ఆరాధించాడట ఇంద్రుడు. అందుకే ఈ రోజు దీపాలతో ఆ తల్లికి పూజలు చేస్తే ఆ ఇంట్లో దారిద్య్రం ఉండదని నమ్ముతుంటారు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే.. దీపం అనేది జీవాత్మకు, పరమాత్మకు ప్రతీక. అందుకే ఏదైనా పూజ చేస్తప్పుడు లేదా దేవుడిని ఆరాధించేటప్పుడు ముందుగా దీపం వెలిగించి తరువాత దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం. షోడసోపాచారాల్లో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది దీపం. అందుకే ఈ దీపాన్ని ఏదైనా శుభకార్యాప్పుడు ముందుగా ఆరాధిస్తారు. మంచికి మాత్రమే కాదు ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా కూడా దేవుడిని ఆరాధించేందుకు ఈ దీపాన్ని ముందుగానే వెలిగిస్తుంటారు. అలాంటి పవిత్రమైన దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. అలాంటప్పుడే మనపై దేవానుగ్రహం ఉంటుంది.