Jobs: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూనియర్ ప్రోగ్రాం మేనేజర్, ఫార్మసిస్ట్, పంచకర్మ అటెంటెంట్ల ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

మొత్తం 26 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 16,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు వేతనం లభిస్తుందని చెప్పవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: Ashoka Vanam lo Arjuna Kalyanam: అశోకవనంలో అర్జున కళ్యాణం.. పాట వచ్చేసింది
డిగ్రీ, ఎంపీటీ డిగ్రీ, ఎండీ (పంచకర్మ), పది, ఇంటర్, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
Also Read: Prince Mahesh Babu: ఆయన బడ్జెట్ దెబ్బకు భయపడుతున్న మహేష్ !