
Spouse: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. దీని వల్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భార్యాభర్తల్లో భయం కలుగుతోంది. అసలు వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? వీటికి ఆస్కారం ఏమిటి? మనుషుల్లో విచ్చలవిడితనం ఎందుకు పెరుగుతోంది? తప్పని తెలిసినా తప్పు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తూ పరాయి వారితో సుఖం కోసం తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాల విషయంలో నానాటికి పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి?
భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిని కాదని ఇతరుల వైపు ఎందుకు మొగ్గు చూపుతారు. వారి ఆకర్షణకు కారణాలేంటి. పెళ్లయిన ఏడేళ్లకు దంపతులకు ఇతరుల మీద వ్యామోహం కలుగుతుందని చెబుతుంటారు. అనవసర అనుమానాలు కూడా వారిని తప్పు చేసేందుకు ఉసిగొల్పుతున్నాయి. ఇద్దరి మధ్య లైంగిక సంబంధాలు ఏర్పడటానికి కలిసి పనిచేసే వారిలో ఎక్కువగా ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. ఇక ఇంట్లో జీవిత భాగస్వామి ప్రవర్తన కూడా దారుణంగా ఉంటే మనసు ప్రశాంతత కోసం ఇతరులతో సరదాగా ఉంటుంటారు. ఇలా వివాహేతరసంబంధాలు ఏర్పడటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.

ఎందుకు ఆకర్షితులవుతారు?
ఎదుటి వారిపై ఎందుకు ఆకర్షితులవుతారు. ఆడైనా మగవారైనా జీవిత భాగస్వామిని కాదని ఇతరుల వైపు చూసేందుకు పలు రకాల కోణాలు ఉంటాయి. ఇంట్లో సుఖం లేకపోతే బయటకు వెళ్లే వారుంటారు. జీవిత భాగస్వామితో సుఖం పొందలేకపోయినా సరే తాను తప్పు చేయననే ఉద్దేశంతో ఉన్న వారు కూడా మనకు కనిపిస్తుంటారు. కొందరి మనస్తత్వం గంభీరంగా ఉంటుంది. ఇంకొందరిది అయోమయంగా ఉంటుంది. స్థిరంగా ఉండేవారు ప్రలోభాలకు గురికారు. కానీ చపల చిత్తం ఉన్న వారు మాత్రం ఇతరుల మాయలో పడుతుంటారు. ఇలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది.
ఎలా గుర్తించొచ్చు
జీవిత భాగస్వామి తప్పు చేస్తున్నారనే సంకేతాలు కనిపిస్తుంటాయి. బాగా రెడీ కావడం, దుస్తుల్లో మార్పులు, సెంటు కొట్టుకోవడం, ఇంటికి లేటుగా రావడం, తరచూ ఫోన్లలో మాట్లాడటం, రహస్యాలు పాటించడం వంటి అంశాలు మనకు కనిపిస్తే జీవిత భాగస్వామి తప్పు చేస్తున్నారనే విషయం నిర్ధారించుకోవచ్చు. కానీ తొందరపడి మాట్లాడకూడదు. కచ్చితంగా తప్పు చేస్తున్నారనే ఆధారాలు ఉంటేనే నిలదీయాలి. అంతేకాని ఎలాంటి ఆధారం లేకుండా నింద వేస్తే వారి మనసు నొచ్చుకుంటుంది.
ఇంకా ఏం చేస్తారు?
తప్పు చేసే వారు జీవిత భాగస్వామికి అనుమానం రాకుండా ఉండేందుకు కూడా అతి తెలివిని ఉపయోగిస్తారు. అవసరం లేకున్నా బహుమతులు ఇవ్వడం, జీవిత భాగస్వామిని తరచూబయటకు తీసుకెళ్లడం, ఏది పడితే అది కొనివ్వడం వంటివి చేస్తున్నా అనుమానించాల్సిందే. ఇలా వివాహేతర సంబంధాల విషయంలో ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. అన్నింటికి ఆధారాలు ఉంటేనే మనం ప్రశ్నించాలి. వివాహేతర సంబంధాలతో చాలా సంసారాలు నాశనం అయిన సంఘటనలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని గ్రహించుకుని జీవిత భాగస్వామినే నమ్ముకోవడం ఉత్తమం.